Page Loader
Virat Kohli Birthday: విరాట్ కోహ్లీ సాధించిన ఈ రికార్డులను బ్రేక్ చేయడం ఇప్పట్లో అసాధ్యమే 
విరాట్ కోహ్లీ సాధించిన ఈ రికార్డులను బ్రేక్ చేయడం ఇప్పట్లో అసాధ్యమే

Virat Kohli Birthday: విరాట్ కోహ్లీ సాధించిన ఈ రికార్డులను బ్రేక్ చేయడం ఇప్పట్లో అసాధ్యమే 

వ్రాసిన వారు Stalin
Nov 05, 2023
07:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆధునిక యుగంలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడు. తన క్రికట్ ప్రయాణంలో ఎన్నో రికార్డులను సృష్టించారు. మైదానంలో చిరుతగా పరుగెట్టే, కోహ్లీ వెంట ఎన్నో మైలురాళ్లు ఆయన వెంటన నడిచాయి. అందరూ కోహ్లీ చేసిన సెంచరీల గురించే మాట్లాడుతారు.. కానీ అతను సృష్టించిన ఎవరకీ తెలియని రికార్డుల గురించి.. విరాట్ పుట్టిన రోజు(Virat Kohli Birthday) సందర్భంగా చర్చించుకుందాం. ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ బ్యాటింగ్‌లో తన పరాక్రమాన్ని చూపించాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 558పరుగులు సాధించాడు. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ ఈ రికార్డు కోహ్లీ పేరిటే ఉంది.

కోహ్లీ

వన్డేల్లో ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు

వన్డేల్లో వేగంగా 8వేలు, 9వేలు, 10వేలు, 11వేల పరుగులు పూర్తి వన్డే‌ల్లో విరాట్ కోహ్లీ రాణింపు అసామాన్యమైనది. వన్డే క్రికెట్‌లో 8,000, 9,000, 10,000, 11,000 పరుగుల మైలురాళ్లను వేగంగా చేరుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 'ఛేజ్ మాస్టర్'.. ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు 'ఛేజ్ మాస్టర్'గా పేరుగాంచిన కోహ్లీ వన్డేల్లో రెండోసారి బ్యాటింగ్ చేస్తూ 26 సెంచరీలు చేశాడు. ఇన్ని సెంచరీలు ఇంతవరకు ఏ బ్యాట్స్ మెన్ చేయలేదు. ఒత్తిడిలో రాణించగల అతని సామర్థ్యాన్ని, జట్టు సవాలుగా ఉన్నప్పుడు అతను అసమానమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వన్డే ఫార్మాట్‌లో చరిత్ర సృష్టించాడు.

కోహ్లీ

మూడు ఫార్మాట్లలో 50+ సగటు

అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్‌లలో 50 కంటే ఎక్కువ సగటును కొనసాగించిన ఏకైక బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. అతని నిలకడ ఆటకు ఇదొక నిదర్శనం. అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ 33 విజయాలు సాధించిన భారత టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతని నాయకత్వంలో, టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో ప్రబలమైన శక్తిగా ఎదిగింది. విజయవంతమైన వన్డే జట్టు కెప్టెన్‌ భారత వన్డే జట్టు కెప్టెన్‌గా, కోహ్లీ 71.83% విజయ శాతాన్ని సాధించాడు. అతని నాయకత్వంలో టీమిండియా 80 వన్డేల్లో 62 గెలిచింది. విజయాల శాతం పరంగా అతను అత్యంత విజయవంతమైన భారత వన్డే కెప్టెన్‌గా నిలిచాడు.

కోహ్లీ

టెస్టు క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ 

టెస్టు క్రికెట్‌లో ఏడు డబుల్ సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లి అద్భుత ప్రతిభకు నిదర్శనం. ఈ ఘనత సాధించడంతో అతను సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ వంటి క్రికెట్ దిగ్గజాలను అధిగమించాడు. తద్వారా కోహ్లీ అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత రికార్డు హోల్డర్‌గా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా, కోహ్లి 5,142 పరుగులు చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో భారత కెప్టెన్‌లలో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.

కోహ్లీ

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కెప్టెన్ కోహ్లీ రికార్డు

టెస్టు క్రికెట్‌లో కోహ్లి అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. పూణేలో దక్షిణాఫ్రికాపై సాధించిన అజేయంగా 254 పరుగులు చేశాడు. ఇది ఒక వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు, టెస్ట్ క్రికెట్‌లో భారత కెప్టెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఒక దశాబ్దంలో మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు అన్ని ఫార్మాట్లలో (2010-2019) 20,960 పరుగులు చేయడం ద్వారా గత దశాబ్దంలో విరాట్ కోహ్లీ క్రికెట్‌పై ఆధిపత్యం చెలాయించాడు. ఒకే దశాబ్దంలో మూడు ఫార్మాట్లలో 20,000 పరుగుల మార్క్‌ను దాటిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.