Page Loader
ఆసియా కప్: నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ బెస్ట్ అంటున్న ఏబీ డివిలియర్స్ 
బ్యాటింగ్ ఆర్దర్ లో నాలుగవ స్థానంలో విరాట్ బెటర్ అంటున్న ఏబీ డివిలియర్స్

ఆసియా కప్: నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ బెస్ట్ అంటున్న ఏబీ డివిలియర్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 26, 2023
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ పోరుకు టీమిండియా సిద్ధమవుతున్న వేళ, బ్యాటింగ్ ఆర్డర్ లో ఏ స్థానంలో ఎవరు వెళ్తున్నారనే విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నాలుగవ స్థానంలో ఏ ఆటగాడిని పంపించాలనేది అందరికీ సందేహంగా ఉంది. తాజాగా ఈ విషయమై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తనదైన సలహా అందించాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ ఆడితే బాగుంటుందని, అతనైతే ఏ స్థానంలోనైనా ఆడగలుగుతాడనీ, ఎక్కడైనా పరుగులు చేసే సత్తా కోహ్లీ దగ్గర ఉందని డివిలియర్స్ అంటున్నాడు.

Details

విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఆ ఇద్దరు ఆటగాళ్ళు 

విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో బాగా ఆడతాడని అందరికీ తెలుసు. అలాగే ఆ స్థానంలో అతను ఎన్నో పరుగులు సాధించాడు కూడా. అయినా కూడా నాలుగవ స్థానంలో ఉన్న లోటును పూడ్చాలంటే విరాట్ కోహ్లీ సరిపోతాడని డివిలియర్స్ చెబుతున్నాడు. నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో దిగితే బాగుంటుందని డివిలియర్స్ కామెంట్స్ చేసాడు. ఇప్పటికైతే నాలుగవ స్థానంలో ఎవరిని దింపాలనే విషయంలో ఇంకా టీమిండియా జట్టు క్లారిటీకి రాలేదు. కాకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనపుడు ఏ స్థానంలోనైనా ఆడాలని ఆల్రెడీ కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చారు.