Page Loader
ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు 11.45కోట్లు వసూలు చేయడంపై కోహ్లీ రియాక్షన్  
తన ఇన్స్ టా గ్రామ్ సంపాదన గురించి వస్తున్న వార్తలపై స్పందించిన కోహ్లీ

ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు 11.45కోట్లు వసూలు చేయడంపై కోహ్లీ రియాక్షన్  

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 12, 2023
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో 256మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా‌లో విరాట్ కోహ్లీ ఒక్క పోస్టుకు 11.45కోట్లు సంపాదిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాపర్ హెచ్ క్యూ అనే సంస్థ, క్రీడాకారుల సోషల్ మీడియా సంపాదనపై ఒక లిస్టును తయారు చేసింది. అందులో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (ఒక్క పోస్టుకు 26.76కోట్లు), రెండో స్థానంలో మరో ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ (ఒక్కో పోస్టుకు 21.49కోట్లు) వసూలు చేస్తున్నారని తెలిపింది.

Details

అంతా అబద్ధం అంటున్న కోహ్లీ 

తాజాగా ఈ విషయమై విరాట్ కోహ్లీ స్పందించారు. సోషల్ మీడియాలో తన ఇన్‌స్టా ఆదాయంపై చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కోహ్లీ అన్నారు. తన జీవితంలో తాను సాధించుకున్న ప్రతీ దానికీ రుణపడి ఉంటానని విరాట్ కోహ్లీ అన్నారు. దీంతో విరాట్ కోహ్లీ ఇన్‌స్టా ఆదాయంపై వచ్చిన వార్తలు అసత్యమని రుజువైపోయింది. అదలా ఉంచితే, ఇన్‌స్టా‌లో ప్రపంచంలోని క్రీడాకారులందరిలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మూడో ఆటగాడిగా కోహ్లీ ఉన్నారు. మొదటి, రెండు స్థానాల్లో క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ ఉన్నారు.