కింగ్ కోహ్లీ అత్యుత్సాహం.. మ్యాచ్ ఫీజులో 10శాతం కోత
ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ నియామళిని ఉల్లంఘించినందుకు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, చైన్న సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో చైన్నై 8 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై 227 పరుగులు చేసింది. చైన్నై ఆల్ రౌండర్ శివం దూబే సంచలన బ్యాటింగ్ తో బెంగళూర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో అతను ఔట్ అయినప్పుడు కోహ్లీ చాలా ఎగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు.
కోహ్లీపై నెజిజన్లు ఫైర్
పదిహేడో ఓవర్ లో పార్నాల్ బౌలింగ్ దూబ్ ఔట్ అయ్యాడు. ఈ ఆనందంలో కోహ్లీ గాల్లో గెంతుతూ సంబరాలు చేశాడు. అయితే ఆ సంబరాలు శ్రుతిమించినట్లుగా కనిపించాడు. ఈ కారణంగానే కోహ్లీపై మ్యాచ్‌లో 10శాతం కోత విధించారు. మరోపక్క నెటిజన్లు కూడా కోహ్లీ తీరును ఎండగడుతున్నారు. ఓ సీనియర్ క్రికెటర్ అయివుండి ఇలా హద్దులు దాటడం మంచిది కాదని, కోహ్లీ మైదానంలో అగ్రెసివ్ ను కొంచెం తగ్గించుకోవాలని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ చాలా సందర్భాల్లో మైదానంలో ఇలా ప్రవర్తించినందుకు గతంలో విమర్శలు ఎదుర్కోన్న విషయం తెలిసిందే