INDvsSA: శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లీ.. టీమిండియా భారీ స్కోరు
ఈ వార్తాకథనం ఏంటి
రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు, దక్షిణాఫ్రికా మధ్య పోరు కొనసాగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా భారీ స్కోర్‌ను ఖరారు చేసింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకం నమోదు చేశాడు. 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 135 పరుగులు చేసిన కోహ్లీ ఇన్నింగ్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 60 పరుగులు చేస్తూ జట్టుకు స్థిరత్వం అందించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 51 బంతుల్లో 57 పరుగులతో మంచి ఆరంభాన్నిచ్చాడు.
Details
నిరాశపరిచన రుతురాజ్ గైక్వాడ్
అయితే రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13), అర్ష్‌దీప్ సింగ్ (0) నిరాశపరిచారు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ క్రిజ్ చేరగానే ఫోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మంచి టచ్‌లో కనిపించినప్పటికీ అటాకింగ్ షాట్ ప్రయత్నంలో నాండ్రే బర్గర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అంతకుముందు రవీంద్ర జడేజా 32 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఓట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, మార్కో యాన్సెన్, కోర్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.