అనుష్కతో కలిసి మాస్ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మతో కలిసి డాన్సులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిమ్ లో వర్కౌట్ చేస్తున్నప్పుడు పంజాబీ సాంగ్ కు వీరిద్దరూ మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ వీడియోను అనుష్క శర్మ తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో అనుష్క శర్మ ఈజీగా డాన్స్ వేయగా.. విరాట్ మాత్రం మధ్యలోనే తప్పుకున్నాడు. అది చూసి అనుష్క చిరునవ్వుతో మురిసిపోయింది. ఇద్దరూ కలిసి అలా స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి డాన్స్ చేస్తుండగా.. విరాట్ కొన్ని సెకన్లలోనే తన వల్ల కాదంటూ పక్కకు వెళ్లిపోయాడు.
కోహ్లీ డాన్స్ వీడియో అదరిపోయే స్పందన
విరాట్ డాన్స్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఒక్కసారిగా ఆగి కుంటుతూ నడవడం అందరికి నవ్వు తెప్పించింది. కోహ్లీ ఫన్నీ కోసమే ఇలా ఉంటాడని ఫ్రాన్స్ రీ ట్విట్స్ చేస్తున్నారు. 2017లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నారు. 2021 జనవరిలో వీరికి ఓ పాప జన్మించింది. అమెకు వామికా అనే పేరు పెట్టారు. పెళ్లి తర్వాత సినిమాకు దూరంగా ఉన్న అనుష్క.. త్వరలో చక్డా ఎక్స్ ప్రెస్ పేరుతో మాజీ పేసర్ ఝలన్ గోస్వామి బయోపిక్ లో యాక్ట్ చేయనుంది.