విరాట్ కోహ్లీని వెంటాడుతున్న దురదృష్టం.. గ్రీన్ డ్రెస్‌లో ఆడితే డకౌట్!
చిన్నస్వామి స్టేడియంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ రాజస్థాన్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే పచ్చదనం పై అవగాహన కల్పించేందుకు 2011 నుంచి ఆర్సీబీ తన హోం గ్రౌండ్ లో ఏదోక మ్యాచ్ లో గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీ. విరాట్ కోహ్లీ గ్రీన్ జెర్సీలో మరోసారి విఫలం కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. టాస్ ఓడిన బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ(0) తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుతిరిగాడు.
రెండుసార్లు విరాట్ కోహ్లీ డకౌట్
గతేడాది సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గ్రీన్ డ్రెస్ లో వచ్చిన విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ గా ఔట్ అయ్యాడు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్ సుచిత్ బౌలింగ్ లో తొలి బంతికే పెవిలియానికి చేరాడు. అయితే ఈ రెండు మ్యాచ్ ల్లోనూ ఆర్సీబీ విజయం సాధించడం విశేషం. పన్నెండేళ్ల కిందట గ్రీన్ జెర్సీ మ్యాచ్ లు ప్రారంభించినప్పటి నుంచి ఆర్సీబీకి పెద్దగా కలిసి రాలేదని చెప్పొచ్చు. 12 సార్లు ఆర్సీబీ గ్రీన్ డ్రెస్ లో ఆడగా.. నాలుగుసార్లు మాత్రమే విజయం సాధించింది. అయితే ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్ ల్లోనూ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.