Ravichandran Ashwin: టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ గుడ్‌బై..ఆ సీక్రెట్స్ చెప్పిన అశ్విన్!
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఈ అంశానికి సంబంధించి జరిగిన పరిణామాలను టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా వెల్లడించాడు. 2025లో ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సిరీస్‌కు కొద్ది రోజుల ముందే కోహ్లీ ఆకస్మికంగా టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతను చివరిసారిగా 2025 జనవరిలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న కోహ్లీ, టెస్టుల నుంచి తప్పుకోవాలా వద్దా అనే విషయంపై అప్పట్లో విస్తృతంగా చర్చలు జరిగాయని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ నిర్ణయం అంత తేలికైనది కాదని కూడా చెప్పాడు.
వివరాలు
కోహ్లీ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు..
అశ్విన్ అభిప్రాయం ప్రకారం.. కోహ్లీకి ఇంకా టెస్ట్ క్రికెట్‌లో ఆడే సామర్థ్యం ఉంది. అయినప్పటికీ, జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతని వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్, రిటైర్మెంట్ తర్వాత కోహ్లీతో జరిగిన వ్యక్తిగత సంభాషణను కూడా వెల్లడించాడు. విరాట్ ఇంకా టెస్ట్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేయగలడని తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జట్టుకు ప్రాధాన్యత ఇచ్చే కోహ్లీ, ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తిరిగి ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం సులభం కాదని అన్నారు.
వివరాలు
మళ్లీ తిరిగి రావడం కష్టమే..
ఇప్పటికే కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కానీ అతని విలువలు, ఆలోచనల ప్రకారం చూస్తే, ఎప్పుడూ జట్టునే ముందుగా ఉంచాడు. ప్రెస్ మీట్లలో కూడా జట్టు విజయానికే ప్రాముఖ్యత ఇస్తూ మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి ఒకసారి రిటైర్ అయిన తర్వాత మళ్లీ తిరిగి రావడం అనేది సులభమైన విషయం కాదు. అయినప్పటికీ, అతనిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని తాను నమ్ముతున్నట్లు అశ్విన్ వివరించాడు.