Page Loader
Virat Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో భారీ రికార్డు..
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో భారీ రికార్డు..

Virat Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో భారీ రికార్డు..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
08:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 13,000 పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా చరిత్రలో నిలిచాడు. ఐపీఎల్ 18వ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఖాతాలో 12,983 పరుగులు ఉండగా, ముంబయి‌తో జరిగిన పోరులో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 13,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. మొత్తం 386 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును నమోదు చేశాడు. కోహ్లీకి ముందు నలుగురు ఆటగాళ్లు మాత్రమే టీ20 ఫార్మాట్‌లో 13 వేల పరుగుల మార్క్‌ను చేరుకున్నారు.

వివరాలు 

టీ20ల్లో 13,000 పరుగులు చేసిన బ్యాటర్లు 

14562 - క్రిస్ గేల్ (381 ఇన్నింగ్స్‌లు) 13610 - అలెక్స్ హేల్స్ (474 ఇన్నింగ్స్‌లు) 13557 - షోయబ్ మాలిక్ (487 ఇన్నింగ్స్‌లు) 13537 - కీరన్ పొలార్డ్ (594 ఇన్నింగ్స్‌లు) 13001* - విరాట్ కోహ్లీ (386 ఇన్నింగ్స్‌లు)

ట్విట్టర్ పోస్ట్ చేయండి

13,000 పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ