ODI World Cup 2023: ఫఖర్ జమాన్‌ను పక్కన పెట్టిన ఆ బుర్ర ఎవరిదో దేవుడికి తెలియాలి : వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచులో పాకిస్థాన్ జట్టు అద్భుతం చేసింది.
ముందుంది కొండంత లక్ష్యమైనా ఏ మాత్రం బెదరకుండా ఆడి మరో విజయాన్ని పాక్ తన ఖాతాలో వేసుకుంది.
ముఖ్యంగా పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 402 పరుగుల లక్ష్య చేధనలో విధ్వంసం సృష్టించాడు. కివీస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు.
కేవలం 81 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో పాక్ బ్యాటర్లు ఎక్కువ ప్రోటీన్లు, తక్కువ పిండి పదార్థాలు తినాలని ఇమామ్ ఉల్ హక్ పేర్కొన్నారు.
దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
Details
పాకిస్థాన్ జట్టులో ధైర్యం ఉంది : సెహ్వాగ్
పాకిస్థాన్ జట్టులో ప్రోటీన్ కు లోటు లేదని ధైర్యం ఉందని సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.
ఫఖర్ జమాన్ పాకిస్థాన్ అత్యుత్తమ బ్యాటర్ అని సెహ్వాగ్ కొనియాడారు.
జమాన్ ఒక్కడే 3 ఇన్నింగ్స్ లో 18 సిక్సర్లు కొడితే, మిగిలిన బ్యాటర్లు 8 మ్యాచుల్లో 36 సిక్సర్లు కొట్టారని ఎద్దేవా చేశారు.
ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల ఇలాంటి ఒక ఆటగాడిని పక్కన పెట్టాలన్న ఆలోచన ఎవరిదో కానీ, ఆ బుర్ర దేవుడికే తెలియాలని, ప్రోటీన్ కి భీ కమీ నహిన్, జజ్బే కి భీ అంటూ పాక్ కోచ్ ను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు.