Virender sehwag : బుమ్రా-భువీ కాంబినేషన్ మళ్లీ రావాలి.. సెహ్వాగ్ కీలక సూచన
ఈ వార్తాకథనం ఏంటి
వయసు అనేది ప్రతిభకు అడ్డంకి కాదని, సరైన ప్రదర్శన ఉంటే మళ్లీ జట్టులోకి తీసుకోవడంలో తప్పులేదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణిస్తున్న స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ విషయంలో బీసీసీఐ మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ ప్రస్తుతం పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. బ్యాటర్లు దూకుడుగా ఆడే టీ20 ఫార్మాట్‌లో కూడా అతను తన ప్రతిభను నిలబెట్టుకుంటూ, స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను కష్టాల్లోకి నెడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి మళ్లీ అవకాశమివ్వాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అలాగే జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి భువీ బౌలింగ్ చేస్తే ప్రత్యర్థి జట్లకు మరింత ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నాడు.
వివరాలు
పాత ఫామ్‌లోనే భువీ..
సెహ్వాగ్ మాట్లాడుతూ.. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, భువనేశ్వర్ వయసు 35-36 మధ్యలో ఉన్నా అతని ప్రదర్శన మాత్రం అగ్రస్థాయిలో ఉందని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు తిరిగి ఎంపిక కావడాన్ని పరిశీలించడంలో తప్పులేదని తెలిపాడు. సెలక్టర్లు ఈ విషయంపై దృష్టి పెట్టాలని, గతంలో విజయవంతమైన బుమ్రా-భువనేశ్వర్ జోడీని మళ్లీ ప్రయత్నించవచ్చని సూచించాడు. ఇప్పటికీ భువీ బౌలింగ్‌లో పదును తగ్గలేదని, పాత ఫామ్‌నే కొనసాగిస్తున్నాడని చెప్పాడు.
వివరాలు
జట్టు విజయాల్లో కీలక పాత్ర..
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న భువనేశ్వర్ పవర్‌ప్లేలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతని బౌలింగ్‌కు ప్రత్యర్థి బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతను 17 వికెట్లు తీసి, 7.54 ఎకానమీ రేట్‌తో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. జట్టు విజయాల్లో అతని పాత్ర అత్యంత కీలకంగా నిలుస్తోంది.