LOADING...
Jaiswal vs Gill: వెస్టిండీస్ టెస్ట్‌లో యశస్వీ జైస్వాల్-గిల్ మధ్య మాటల యుద్ధం 
వెస్టిండీస్ టెస్ట్‌లో యశస్వీ జైస్వాల్-గిల్ మధ్య మాటల యుద్ధం

Jaiswal vs Gill: వెస్టిండీస్ టెస్ట్‌లో యశస్వీ జైస్వాల్-గిల్ మధ్య మాటల యుద్ధం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2025
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా టెస్టు జట్టులో యశస్వీ జైస్వాల్-శుభ్‌మన్ గిల్ మధ్య మరోసారి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో తొలి రోజు అద్భుతంగా ఆడిన యశస్వీ జైస్వాల్ (175) మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, రనౌట్ అవ్వడంతో డబుల్ సెంచరీ అవకాశం చేజారింది. జైస్వీ నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పైన కోపం వ్యక్తం చేశారు. గిల్ పరుగు కోసం రాకపోవడంతో జైస్వీ చేతితో తల కొట్టుకుని స్టేడియం వదిలాడు. ఇన్నింగ్స్‌లో 92వ ఓవర్‌లో జైదెన్ సీలెస్ బంతి మిడాఫ్ వైపుకు వెళ్లడంతో యశస్వీ రన్నింగ్ మొదలెట్టాడు.

Details

నెటిజన్ల ఆగ్రహం

కానీ గిల్ అతడి పిలుపు పట్టించుకోకపోవడంతో, సగం పిచ్ దాటిన స్థాయిలో జైస్వీ రనౌట్ అయ్యాడు. ఈ సంఘటన తర్వాత "ఇట్స్ మై కాల్" అని కోపంతో గిల్‌పై జైస్వీ స్పందించాడు. ఫలితంగా 74 పరుగుల భాగస్వామ్యం కుదిరి, జైస్వీ డబుల్ సెంచరీ కలలు అవిరి కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్ పరుగు కోసం రాకపోవడం కారణంగా యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్ అయ్యింది. టీమిండియా జట్టులో తాత్కాలిక ఉద్రిక్తత సృష్టించింది.