LOADING...
Tilak Varma: మేము గంటసేపు వేచి చూసినా ఆసియా కప్ ట్రోఫీ కనిపించలేదు: తిలక్ వర్మ
మేము గంటసేపు వేచి చూసినా ఆసియా కప్ ట్రోఫీ కనిపించలేదు: తిలక్ వర్మ

Tilak Varma: మేము గంటసేపు వేచి చూసినా ఆసియా కప్ ట్రోఫీ కనిపించలేదు: తిలక్ వర్మ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరుదైన వ్యాధితో బాధపడినట్లు భారత క్రికెటర్ తిలక్‌ వర్మ ఇటీవల స్వయంగా వెల్లడించాడు. ఆ సందర్భంలో ముంబయి ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్ తన పక్కన నిలిచినందుకు ఆయన కృతజ్ఞత తెలిపారు. తాజాగా ఆసియా కప్‌ ట్రోఫీ విషయంలో ఆయన స్పందించారు. ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించడంలో ఈ తెలుగు కుర్రాడిదే కీలక పాత్ర. అయితే, ట్రోఫీ ఇవ్వకుండా ఏసీసీ అధ్యక్షుడు మోసిన్‌ నఖ్వీ 'పిల్ల చేష్టలు' సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ రోజున జరిగిన సంఘటనను తిలక్‌ వివరించారు. దాదాపు గంటసేపు మైదానంలో ఉన్నా సరే ట్రోఫీ తమకు కనిపించలేదని వ్యాఖ్యానించాడు.

వివరాలు 

మైదానంలో ఎక్కడా కూడా ట్రోఫీ కనిపించలేదు

''మేమంతా మైదానంలో వేచి చూస్తూ ఉన్నాం. దాదాపు గంట గడిచిపోయింది. ఇదంతా మీరు టీవీల్లోనూ చూసి ఉంటారు. నేను,ఇతర ఆటగాళ్లంతా గ్రౌండ్‌లోనే పడుకొని ఉన్నాం. అర్ష్‌దీప్‌ సింగ్‌ రీల్స్‌ చేయడంలో బిజీగా ఉండగా, మేమంతా ట్రోఫీ వచ్చేసిందని ఆలోచిస్తూ మేమంతా అలాగే ఉండిపోయాం. కానీ ఎక్కడా ట్రోఫీ కనిపించలేదు. అప్పుడు అర్ష్‌దీప్‌ సింగ్‌ కల్పనతో ట్రోఫీ వచ్చిందని చూపించేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ సమయంలో చేసుకున్న సంబరాలు గుర్తు చేసుకుని, ట్రోఫీ లేకపోయినా అలాగే జరుపుకుందాం అని అన్నాడు. నేను, ఐదుగురు క్రికెటర్లు ఆలా చేసాము'' అని తిలక్‌ తెలిపారు.

వివరాలు 

నమ్మకంతో ఉన్నాం.. 

''మేము టోర్నీలో మూడు సార్లు పాకిస్థాన్‌ను ఓడించాం. ఫైనల్‌ ముందు నుంచే గెలుస్తామని నమ్మకం ఉండేది. క్రికెట్ ఒక తమాషా గేమ్‌ఇలాంటి మెగా టోర్నీల్లో ఆడితే ఆ మజానే వేరు. నేను పాకిస్థాన్‌పై ఎలాంటి ప్యాషన్‌తో ఆడానో.. ఇతర మ్యాచుల్లో అలా ఆడలేకపోవచ్చు. కానీ, జట్టు విజయం సాధించేందుకు చేసే ప్రయత్నం మాత్రం ఆగదు'' అని తిలక్‌ వ్యాఖ్యానించాడు.