MI w Vs DC w: ఫైనల్‌లో దిల్లీని ఓడించి రెండో టైటిల్ గెలుస్తాం: హీలే మ్యాథ్యూస్
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ ఫైనల్ దశకు చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టేందుకు ముంబయి ఇండియన్స్ మహిళా జట్టు సిద్ధమైంది.
ముంబయి ఇప్పటికే ఒకసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దిల్లీ ఈసారి గెలిస్తే తొలిసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంటుంది.
వరుసగా మూడు సీజన్లలోనూ దిల్లీ ఫైనల్ చేరడం విశేషం. అయితే ముంబయి మరోసారి మొదటి ఎడిషన్ ఫలితాన్నే పునరావృతం చేస్తుందని ప్లేయర్ హీలే మ్యాథ్యూస్ ధీమా వ్యక్తం చేసింది.
మరోసారి ఫైనల్‌కు చేరుకోవడం ఆనందంగా ఉందని, దీని కోసం చాలా కష్టపడ్డామన్నారు. మొదటి సీజన్‌లో తామే విజేతగా నిలిచామని చెప్పారు.
Details
17 వికెట్లు తీసిన హీలే
ఇప్పుడు అదే ఫలితాన్ని మళ్లీ సాధించాలని అనుకుంటున్నామన్నారు.
టైటిల్ గెలిచిన ఆ క్షణాలు ఇప్పటికీ తన మదిలో ఉన్నాయన్నారు.
ఈసారి కూడా ఫైనల్‌లో దిల్లీని ఓడించి రెండో కప్‌ను సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని హీలే మ్యాథ్యూస్ పేర్కొంది.
17 వికెట్లు తీసిన హీలే ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ హోల్డర్. అలాగే అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన ఆమె, ఇప్పటికే మూడు అర్ధశతకాలతో 304 పరుగులు సాధించింది.
Details
హీలే సూపర్ ప్లేయర్ - హర్మన్‌ప్రీత్ కౌర్
తమకు గొప్ప అవకాశం లభించిందని, సానుకూల దృక్పథంతో తాము ముందుకెళ్తామని హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు.
నాలుగు రోజుల వ్యవధిలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చిందని, వాటిని ఆస్వాదించామన్నారు. జట్టు సభ్యులంతా ఉత్సాహంగానే ఉన్నారని, హీలే గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆమె కొనియాడారు.
జట్టు కోసం ఆమె దేనికైనా సిద్ధంగా ఉంటుందని, బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోందన్నారు.
తొలి ఓవర్‌లో ఎవరికైనా బౌలింగ్ ఇచ్చే అవసరం వస్తే, నేను హీలేనే ఎంచుకుంటానని, ఆమెపై ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదని ముంబయి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రశంసలు కురిపించింది.