Page Loader
Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్‌.. భార్య ప్రీతి నారాయణన్‌ ఏం చెప్పారంటే?
అశ్విన్ రిటైర్మెంట్‌.. భార్య ప్రీతి నారాయణన్‌ ఏం చెప్పారంటే?

Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్‌.. భార్య ప్రీతి నారాయణన్‌ ఏం చెప్పారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2024
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల తన రిటైర్మెంట్‌ను ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు అశ్చర్యానికి గురయ్యారు. ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన తరువాత, అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం కారణంగా అభిమానులలో పెద్ద చర్చ మొదలైంది. దీనిపై అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్‌ కూడా స్పందించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా పోస్టు పెట్టారు. ఈ నిర్ణయం తన గుండెపై భారం వేసినట్లు పేర్కొన్నారు. ఆమె రాసిన పోస్టులో తన ఫేవరెట్ క్రికెటర్‌ని గురించి మాట్లాడాలా? లేక నా జీవిత భాగస్వామి అనే కోణాన్ని ఎంచుకోవాలా? అని భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

Details

టీమిండియా విజయాల కోసం నిరంతరం శ్రమించాడు

అశ్విన్ సాధించిన అనేక విజయాలను, ప్రత్యేకంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ విజయం అనంతరం ఆనందంతో కన్నీరు పెట్టుకున్న ఘట్టాలను గుర్తు చేశారు. గబ్బా, మెల్‌బోర్న్ టెస్టుల్లో అశ్విన్ చేసిన ప్రదర్శన, టీ20ల్లో తన పునరాగమనం కూడా ఆమెకు భావోద్వేగానికి గురి చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అశ్విన్ క్రికెట్ పట్ల ఎంత నిబద్ధత ఉన్నాడో ఆమె తన అనుభవాల ద్వారా వివరిస్తూ అతను ఎప్పుడూ తన కెరీర్ కోసం ఎంతో శ్రమించారని ఆమె చెప్పుకొచ్చారు.