Loading...
Sreesanth vs Sanju Samson: సంజు శాంసన్‌-శ్రీశాంత్‌ మధ్య ఏం జరిగింది?.. హాట్‌టాపిక్‌గా మారిన వీడియో
సంజు శాంసన్‌-శ్రీశాంత్‌ మధ్య ఏం జరిగింది?.. హాట్‌టాపిక్‌గా మారిన వీడియో

Sreesanth vs Sanju Samson: సంజు శాంసన్‌-శ్రీశాంత్‌ మధ్య ఏం జరిగింది?.. హాట్‌టాపిక్‌గా మారిన వీడియో

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకే రాష్ట్రానికి చెందిన ఇద్దరు క్రికెటర్లు ఎదురెదురుగా కనిపించినా.. కనీసం పలకరించుకోలేదు. కరచాలనం చేసుకోకపోగా ఒకరినొకరు పట్టించుకోనట్లుగా వ్యవహరించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన కేరళ క్రికెట్ లీగ్‌ (KCL) 2026 ఫైనల్‌ అనంతరం జరిగిన టైటిల్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో చోటుచేసుకుంది. భారత క్రికెటర్‌ సంజు శాంసన్‌, మాజీ ఆటగాడు శ్రీశాంత్‌ ఇలా వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

అసలు ఏం జరిగింది?

ఫైనల్‌ అనంతరం ట్రోఫీ ప్రజెంటేషన్‌ కోసం సంజు శాంసన్‌ అప్పటికే వేదికపై ఉన్నారు.

ఆ సమయంలో మైక్‌ పట్టుకుని స్టేజ్‌పైకి వచ్చిన శ్రీశాంత్‌.. అక్కడున్న పలువురు ప్రముఖులతో కరచాలనం చేశారు.

అయితే సంజు శాంసన్‌ వైపు మాత్రం వెళ్లకుండా నేరుగా కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ (KCA) అధికారుల వైపు వెళ్లారు.

సంజు కూడా శ్రీశాంత్‌ను పలకరించేందుకు ముందుకు రాలేదు. ఈ స్వల్ప వ్యవధి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా? అనే చర్చ మొదలైంది.

వివరాలు

గతంలోనూ విమర్శలు చేశారా?

ఇటీవల సంజు శాంసన్‌ ఐపీఎల్‌ ప్రయాణానికి సంబంధించిన విషయాలపై శ్రీశాంత్‌ పలు సందర్భాల్లో మాట్లాడారు.

తనవంతుగా సంజును రాహుల్‌ ద్రవిడ్‌కు పరిచయం చేశానని, అతడికి ఐపీఎల్‌లో అవకాశం దక్కేలా తాను కీలక పాత్ర పోషించానని శ్రీశాంత్‌ గతంలో పేర్కొన్నారు.

సంజు తన ఐపీఎల్‌ అరంగేట్రం గురించి చెబుతున్న విధానం తనకు నచ్చలేదని కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలోనే కేరళ క్రికెట్ లీగ్‌ ఫైనల్‌ వేదికపై చోటుచేసుకున్న ఈ ఘటనకు అభిమానులు ఆ వ్యాఖ్యలను జోడించి చూస్తున్నారు.

ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా మనస్పర్థలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

మంచి స్నేహితులే అంటున్న ఫ్యాన్స్‌..

అయితే సంజు శాంసన్‌, శ్రీశాంత్‌ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారాన్ని కొందరు అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఇద్దరికీ చాలా కాలంగా మంచి అనుబంధం ఉందని గుర్తు చేస్తున్నారు.

గతంలో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ.. ఈ ఒక్క ఘటన ఆధారంగా వారి మధ్య గొడవలు ఉన్నాయని నిర్ణయానికి రావడం సరికాదని అంటున్నారు.

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోలో ఇద్దరూ ఆ సమయంలో కరచాలనం చేసుకోలేదన్న విషయం మాత్రమే స్పష్టంగా కనిపిస్తోంది.

దానికి అసలు కారణం ఏమిటనేది మాత్రం తెలియదు. సంజు శాంసన్‌ లేదా శ్రీశాంత్‌ ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

దీంతో ఇద్దరి మధ్య నిజంగా ఏం జరిగిందన్న ప్రశ్నకు సమాధానం రావాలంటే వారిలో ఎవరో ఒకరు దీనిపై స్పందించాల్సిందే

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

ADVERTISEMENT