Loading...
MS Dhoni : ధోని చెవిలో కనిపించిన ఆ చిన్న పరికరం ఏంటి?.. వైరల్ ఫొటోల వెనుక అసలు కథ ఇదే!
ధోని చెవిలో కనిపించిన ఆ చిన్న పరికరం ఏంటి?.. వైరల్ ఫొటోల వెనుక అసలు కథ ఇదే!

MS Dhoni : ధోని చెవిలో కనిపించిన ఆ చిన్న పరికరం ఏంటి?.. వైరల్ ఫొటోల వెనుక అసలు కథ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ విజయంతో ఆరంభించింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌ను భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోని స్టేడియంలోని వీఐపీ స్టాండ్స్‌లో కూర్చొని వీక్షించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే మ్యాచ్‌ కంటే ఎక్కువగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది ధోని చెవిలో కనిపించిన ఓ చిన్న పరికరం. అది ఏమిటనే ఆసక్తి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

వివరాలు

లైవ్‌ కామెంట్రీ వినే అవకాశం 

మొదట చాలా మంది దానిని బ్లూటూత్‌ ఇయర్‌బడ్‌ లేదా వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్‌ అని భావించారు.

కానీ వాస్తవానికి అది స్టేడియం రేడియో రిసీవర్ అనే ప్రత్యేక పరికరం. దీని సహాయంతో స్టేడియంలోనే ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షిస్తూనే బంతి బంతికి లైవ్‌ కామెంట్రీ వినే అవకాశం ఉంటుంది.

ఇంగ్లండ్‌లోని క్రికెట్‌ మైదానాల్లో ఇలాంటి రేడియో రిసీవర్లను అభిమానులు విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.

మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూస్తూనే కామెంటేటర్ల విశ్లేషణను కూడా వినేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

వివరాలు

ఈ పరికరం ఎలా పనిచేస్తుంది?

స్టేడియం పరిధిలో ప్రసారమయ్యే లోకల్‌ రేడియో సిగ్నల్‌ను ఈ పరికరం అందుకుంటుంది.

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు స్టేడియంలోనే వీటిని అద్దెకు తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.

సరైన రేడియో ఫ్రీక్వెన్సీకి ట్యూన్‌ చేస్తే మ్యాచ్‌కు సంబంధించిన ప్రత్యక్ష కామెంట్రీ నిరంతరం వినిపిస్తుంది.

స్టేడియం బయటకు వెళ్లిన వెంటనే ఈ సిగ్నల్‌ అందుబాటులో ఉండదు.

ఈ రేడియో రిసీవర్లను కేవలం అభిమానులే కాకుండా మాజీ క్రికెటర్లు కూడా వినియోగిస్తుంటారు.

ముఖ్యంగా స్టేడియంలో దూరంగా కూర్చున్నప్పుడు ఫీల్డింగ్‌ మార్పులు, బౌలర్ల వ్యూహాలు, గణాంకాలు వంటి కీలక సమాచారాన్ని వెంటనే తెలుసుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

ADVERTISEMENT