LOADING...
IND vs AUS: ఆస్ట్రేలియాతో మొదటి వన్డే.. టీమిండియా స్కోరు ఎంతంటే?
ఆస్ట్రేలియాతో మొదటి వన్డే.. టీమిండియా స్కోరు ఎంతంటే?

IND vs AUS: ఆస్ట్రేలియాతో మొదటి వన్డే.. టీమిండియా స్కోరు ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ పూర్తైంది. వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు పరిమితం చేయడంతో, భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే నిలిచింది. డక్‌వర్త్-లూయిస్‌ విధానం ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత్ తరఫున గణనీయంగా రాణించిన వారు కేవలం ఇద్దరే. కెఎల్ రాహుల్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అక్షర్ పటేల్ 31 పరుగులు చేసి జట్టుకు కొంత స్థిరత్వం తీసుకొచ్చాడు.

Details

 రాణించిన ఆసీస్ బౌలర్లు

మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చాటింది. హేజిల్‌వుడ్, వోవెన్, కునెమన్ తలో రెండు వికెట్లు తీశారు. మార్క్ స్టార్క్, ఎలిస్ చెరో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్ అంతా ఆస్ట్రేలియా బౌలర్ల నియంత్రణలోనే సాగింది. ఇప్పుడు ఆతిథ్య జట్టు విజయానికి 131 పరుగుల లక్ష్యం మాత్రమే ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.