India Vs Pakistan: 'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ క్రీడాభిమానులకు ఎప్పుడూ ఉత్కంఠను రేపిస్తుంది.
ఈ రెండు జట్ల మధ్య ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు, ఆసక్తికర ఘటనలు క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
ఇప్పుడు ఈ క్రికెట్ రైవల్రీపై నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ తీసుకొస్తోంది. 'ది గ్రేట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో తాజాగా విడుదల చేసిన డాక్యుమెంటరీ పోస్టర్‌లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ పాక్ జట్టుతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించడం క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
Details
ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్
ఈ డాక్యుమెంటరీలో సెహ్వాగ్, గంగూలీ, షోయబ్ అక్తర్, వాకర్ యూనిస్, ఇంజమామ్ ఉల్ హక్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ప్రముఖ ఆటగాళ్ల ప్రసంగాలు కూడా ఉంటాయని సమాచారం.
ఈ డాక్యుమెంటరీలో, భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎలా అభివృద్ధి చెందిందో, దానికి కారణమైన ఆసక్తికర అంశాలను చూపించనున్నారు.
నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంటరీ గురించి 'రెండు దేశాల మధ్య అద్భుతమైన పోటీ, 160 కోట్ల మంది ఆశలు, భారత్-పాక్ క్రికెట్ అనుభవాన్ని మరింత ఆస్వాదించండి' అని పేర్కొంది.
ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా జరగనున్న నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీపై మరింత ఆసక్తి నెలకొంది.