Himani Mor: USAలో చదువు, టెన్నిస్ ప్లేయర్, నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఏటువంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకుని, అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు.
దీనితో, "నీరజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు?" ఆమె బ్యాక్‌గ్రౌండ్ గురించి చర్చలు మరింత పెరిగాయి.
స్వస్థలం
నీరజ్ భార్య పేరు హిమానీ. ఆమె ఒక టెన్నిస్ క్రీడాకారిణి. హిమానీ హరియాణాలోని లార్సౌలీ ప్రాంతానికి చెందిన యువతి.
పానిపట్‌లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.
దిల్లీ యూనివర్సిటీలోని మిరాండా హౌస్ నుండి పొలిటికల్ సైన్స్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందింది.
వివరాలు
అమెరికాలో చదువు
ప్రస్తుతం, హిమానీ అమెరికాలో స్పోర్ట్స్ సంబంధిత విద్యనూ అభ్యసిస్తోంది.
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ ఇన్ సైన్స్ చేస్తోంది.
ఫ్రాంక్లిన్ పీర్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ప్రస్తుతం, ఆమె తన విద్యాధిక శాస్త్రంలో అభ్యసిస్తున్న కాలేజీలో టెన్నిస్ టీమ్‌ను మేనేజ్ చేస్తోంది.
వివరాలు
పెళ్లి వివరాలు
నీరజ్ చోప్రా - హిమానీ పెళ్లి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది.
తన పెళ్లి విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. తన పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేశాడు.
"జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను" అని పేర్కొన్నాడు. "మేము ఈ క్షణం వరకు నడిచేలా ఆశీర్వదించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు" అని చోప్రా చెప్పారు.
ఒలింపిక్స్‌లో నీరజ్ విజయం
27 ఏళ్ల నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. అనంతరం, పారిస్ ఒలింపిక్స్‌లో రజతం కూడా గెలిచాడు.