Tejasvi Singh: కేకేఆర్‌కు కొత్త యువ వికెట్ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించి నిర్వహించిన మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఒక యువ భారత క్రికెటర్‌ను తమ జట్టులోకి తీసుకుంది. అబుదాబిలో జరిగిన ఈ వేలంలో ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల వికెట్‌కీపర్-బ్యాటర్ తేజస్వి సింగ్ దహియాను కేకేఆర్ రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. తేజస్వి తన పేరును రూ.30 లక్షల ప్రాథమిక ధరతో నమోదు చేసుకోగా, అతని ప్రతిభపై విశ్వాసం ఉంచిన కోల్‌కతా ఫ్రాంచైజీ పెద్ద మొత్తాన్ని వెచ్చించింది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడినప్పటికీ, కేకేఆర్ వెనుకడుగు వేయకుండా బిడ్డింగ్ కొనసాగించి చివరకు తేజస్విని దక్కించుకుంది.
వివరాలు
వికెట్‌కీపింగ్‌తో పాటు పవర్ హిట్టింగ్ చేయగల సామర్థ్యం
ఇప్పటివరకు తేజస్వి సింగ్ కేవలం ఆరు టీ20 మ్యాచ్‌ల్లోనే పాల్గొన్నా.. తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఫార్మాట్‌లో అతడు 113పరుగులు చేయగా,స్ట్రైక్‌రేట్ 168.65గా నమోదైంది. అంతేకాకుండా టీ20ల్లో అతడి సగటు 56.50గా ఉండటం గమనార్హం.ఇప్పటివరకు 5 ఫోర్లు,8 సిక్సర్లు బాదిన ఈ యువ ఆటగాడు భవిష్యత్తులో విశ్వసనీయ ఫినిషర్‌గా ఎదుగుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వికెట్‌కీపింగ్‌తో పాటు పవర్ హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడిగా తేజస్వి గుర్తింపు పొందుతున్నాడు. యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంలో పేరొందిన కేకేఆర్ మరోసారి అదే విధానాన్ని కొనసాగిస్తూ తేజస్వి సింగ్ దహియాను ఎంపిక చేసింది. ఐపీఎల్ 2026లో అతడు తన ప్రతిభను ఎంతవరకు నిరూపించుకుంటాడో, జట్టుకు ఎంతగా దోహదపడతాడో చూడాల్సి ఉంది.
వివరాలు
తేజస్వి సింగ్ కి ముందే భారీ సంచలనాలకు తెరలేపిన కేకేఆర్
ఐపీఎల్ 2026 వేలంలో కేకేఆర్ సొంతం చేసుకున్న నాలుగో ఆటగాడు తేజస్వి సింగ్. అతడికి ముందే ఈ ఫ్రాంచైజీ భారీ సంచలనాలకు తెరలేపింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిపింది. అనంతరం న్యూజిలాండ్‌కు చెందిన వికెట్‌కీపర్-బ్యాటర్ ఫిన్ అలెన్‌ను రూ.2 కోట్లకు, శ్రీలంక వేగ బౌలర్ మతీశా పతిరనను రూ.18 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది.
వివరాలు
కేకేఆర్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
కామెరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా) - రూ.25.20 కోట్లు ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) - రూ.2 కోట్లు మతీశా పతిరన (శ్రీలంక) - రూ.18 కోట్లు తేజస్వి సింగ్ దహియా (భారత్) - రూ.3 కోట్లు