Page Loader
Umar Nazir Mir: రోహిత్,రహానే,శివమ్ దూబేలను అవుట్ చేసిన 6.4అడుగుల  పొడవున్న జమ్ముకశ్మీర్ ఫాస్ట్ బౌలర్..ఉమ‌ర్ న‌జీర్ మీర్ ఎవరు?

Umar Nazir Mir: రోహిత్,రహానే,శివమ్ దూబేలను అవుట్ చేసిన 6.4అడుగుల  పొడవున్న జమ్ముకశ్మీర్ ఫాస్ట్ బౌలర్..ఉమ‌ర్ న‌జీర్ మీర్ ఎవరు?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉమర్ నజీర్ మీర్ మారుమోగిపోతుంది. రంజీ ట్రోఫీలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడి అద్వితీయ ప్రదర్శనే దీనికి కారణం. జమ్ము కశ్మీర్‌కు చెందిన ఈ 6 అడుగుల 4 అంగుళాల పొడవైన పేసర్ తన బౌలింగ్‌తో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ రికార్డులు కలిగిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలను కూడా అతడు ఇబ్బంది పెట్టాడు.

వివరాలు 

రంజీ ట్రోఫీ మ్యాచులో అద్భుత ప్రదర్శన 

రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్‌ల్లో భాగంగా గురువారం ముంబై, జమ్ము కశ్మీర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై మొదట బ్యాటింగ్ చేస్తుండగా, ఉమర్ నజీర్ మీర్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 31 ఏళ్ల ఈ పేసర్ తన వేగం, బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. షార్ట్ పిచ్ డెలివరీతో రోహిత్ శర్మ (3)ను ఔట్ చేయగా, మంచి ఫామ్‌లో ఉన్న ముంబై కెప్టెన్ అజింక్యా రహానే (12)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత శివమ్ దూబే (0)ను తొలి బంతికే ఔట్ చేశాడు. అతనితో పాటు ఇతర బౌలర్లు కూడా చక్కటి ప్రదర్శన చూపడంతో ముంబై జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 33.2 ఓవర్లలో 120 పరుగులకే ముగించింది.

వివరాలు 

ఉమర్ నజీర్ మీర్ గురించి 

ఈ మ్యాచ్‌లో ఉమర్ నజీర్ మీర్ 11 ఓవర్లు బౌలింగ్ చేసి 41 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ముంబై బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (4),శ్రేయస్ అయ్యర్ (11)లు విఫలమవగా,శార్దూల్ ఠాకూర్ (51) హాఫ్ సెంచరీతో మాత్రమే రాణించాడు. 31ఏళ్ల ఉమర్ నజీర్ మీర్ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఆటగాడు.అతడి పొడవు 6 అడుగులు 4 అంగుళాలు. తన పేస్,బౌన్స్‌ సహకారంతో బ్యాటర్లను ఇబ్బందికి గురి చేయడం అతడి ప్రత్యేకత. 2013లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను ఆరంభించిన అతడు ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడి 138 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 54 వికెట్లు,టీ20ల్లో 32 వికెట్లు సాధించాడు.2018-19 దేవధర్ ట్రోఫీకి ఇండియా సి జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

వివరాలు 

అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు

తన ఎత్తు, స్పీడ్ కారణంగా అతడు బౌలింగ్‌లో సహజంగా ఉన్న బలాలను బాగా ఉపయోగించుకుంటున్నాడు. రంజీ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో అతడి ప్రదర్శన మరింత మెరుగై, అతనికి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కలిగే అవకాశం ఉంది.