రంజీ ట్రోఫీ: వార్తలు

12 May 2024

బీసీసీఐ

Ranji Trophy: దేశవాళీ క్రికెట్‌లో పెద్ద మార్పు .. ఇక నుంచి రెండు దఫాలు 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్‌లో పెద్ద మార్పును తీసుకురానుంది.

ఇరానీ కప్‌లో సెంచరీలతో అదరగొడుతున్న యశస్వి జైస్వాల్

భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఇరానీ కప్‌లో అదరగొడుతున్నాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తరుపున బరిలోకి దిగిన యశస్వి.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెలరేగిపోయాడు.అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ (259 బంతుల్లో 213) రెండో ఇన్నింగ్స్ లో (132 బంతుల్లో 121 నాటౌట్) తో దుమ్ము లేపుతున్నాడు.

Irani Cup: 33 ఏళ్ల రికార్డును ఇరానీ కప్‌లో బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్

ముంబై యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇరానీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ టోర్నిలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరుపున బరిలోకి దిగిన జైస్వాల్.. 33 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. మార్చి 1న మధ్యప్రదేశ్ జరిగిన ప్రారంభ మ్యాచ్ లో 230 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

ఇరానీ కప్‌లో తలపడనున్న మధ్యప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా

గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో మార్చి 1 నుంచి మధ్య ప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా టీం మధ్య ఇరానీ కప్ టోర్నీ జరగనుంది. రంజీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన మిగిలిన జట్ల ప్లేయర్లను ఓ టీమ్‌‌గా చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌గా, రంజీ ట్రోఫీ విజేతతో ఇరానీ కప్ జరుగుతుంది

సెమీస్‌లో సమరానికి సిద్ధమైన బెంగాల్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కర్నాటక

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ దశ పూర్తి అయింది. బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, సౌరాష్ట్ర, కర్ణాటక జట్లు ప్రస్తుతం సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 8న ప్రారంభం కానున్నాయి. అయితే ఇంతవరకు వేదికలు నిర్ణయించకపోవడం గమనార్హం.

రంజీ ట్రోఫీలో సెమీస్‌కు చేరిన సౌరాష్ట్ర

రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా క్వార్టర్ ఫైనల్ పోరులో పంజాబ్‌పై 71 పరుగుల తేడాతో సౌరాష్ట్ర విజయం సాధించి, సెమీ-ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఆంధ్రాపై విజయం సాధించి సెమీస్‌కు చేరిన మధ్యప్రదేశ్

రంజీ ట్రోఫీ 2022-23 క్వార్టర్ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్ ఆంధ్రపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. రికీభుయ్, కరణ్ షిండేల సెంచరీలతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసింది. అయితే 2వ ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 93 ​​పరుగులకే ఆలౌటైంది.

ఒంటిచేత్తో విహారి బ్యాటింగ్, స్పందించిన దినేష్ కార్తీక్

టీమిండియా ప్లేయర్ హనుమాన్ విహారికి క్రికెట్ పట్ల ఎంతో నిబద్ధత ఉందని మనకు తెలుసు. ఈ మధ్య ఆస్ట్రేలియా టూరులో ఆ టీమ్ బౌలర్లు విసురుతున్న బంతులకు తన శరీరాన్ని అడ్డుగా పెట్టి అప్పట్లో విరోచితంగా పోరాడిన విషయం తెలిసిందే.

ఝార్ఖండ్ పై విజయం సాధించి సెమీస్‌కు చేరిన బెంగాల్

2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్‌పై ఘన విజయం సాధించి బెంగాల్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.ఝార్ఖండ్ పేసర్ ఆకాశ్ దీప్ ఆరు వికెట్లు పడగొట్టడంతో, 9 వికెట్ల తేడాతో బెంగాల్ గెలుపొందింది.

ఉత్తరాఖండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన కర్ణాటక

2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్‌పై సంచనల విజయంతో కర్ణాటక సెమీ ఫైనల్‌కు చేరుకుంది. కర్ణాటక విజయంలో శ్రేయాస్ గోపాల్, మురళీధర్ వెంకటేష్, కీలక పాత్ర పోషించారు.

కర్ణాటక తరఫున సూపర్ సెంచరీతో మెరిసిన శ్రేయాస్ గోపాల్

ఆల్ రౌండర్ శ్రేయాస్ గోపాల్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశారు. క్వార్టర్-ఫైనల్‌లో ఉత్తరాఖండ్‌పై కర్ణాటక తరఫున అజేయ సెంచరీతో అదరగొట్టాడు. గోపాల్ ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఐదు సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచారు. మొత్తం ఈ ఫార్మాట్లో 3000 పరుగులకు మార్కును దాటి సత్తా చాటాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రికార్డు క్రియేట్ చేసిన మయాంక్ అగర్వాల్

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనతను సాధించాడు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ పోరులో కర్నాటక కెప్టెన్ మయాంక్ అద్భుత హాఫ్ సెంచరీతో రికార్డును క్రియేట్ చేశాడు. 109 బంతుల్లో 89 పరుగులు చేసి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 6500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.

అవేష్‌ఖాన్ బౌలింగ్‌లో గాయపడ్డ హనుమ విహారి

రంజీ ట్రోఫీలో ఆంధ్ర కెప్టెన్ హునమ విహారి గాయపడ్డాడు. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022-23 క్వార్టర్-ఫైనల్లో అవేష్ ఖాన్ బౌన్సర్ దెబ్బకు విహారి మణికట్టు ఫ్రాక్చర్ అయింది.