Ranji Trophy Origin story: రంజీ ట్రోఫీ ఎలా ప్రారంభమైంది.. దానికి అసలా ఆ పేరు ఎలా వచ్చిందంటే?
క్రికెట్ ను ఒక మతంగా భావించే భారతదేశంలో రంజీ ట్రోఫీ, భారత క్రికెట్‌కి దాదాపు శతాబ్దం పైగా చరిత్ర ఉంది. ప్రతి క్రికెటర్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ రంజీ ట్రోఫీతోనే ప్రారంభిస్తాడు. ఐపీఎల్ కంటే ముందు, రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీలలో ప్రతిభ ఆధారంగానే టీమిండియా ఆటగాళ్ల ఎంపిక జరుగుతుండేది. అయితే, ఈ గొప్ప చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ పుట్టుక గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భారత క్రికెట్ పితామహుడు
ప్రస్తుత తరంవారికి క్రికెట్ అంటే సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్ , కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు గుర్తొస్తారు. వీరు భారత క్రికెట్ కు ఎంతో పేరు తెచ్చిన వారు. కానీ, వీరిది భారత క్రికెట్‌కి పితామహులు కాదు. మరి, భారత క్రికెట్ పితామహుడు ఎవరు? రంజీ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. క్రికెట్ గేమ్ ఇంగ్లాండ్‌లో పుట్టింది.కానీ, భారతదేశానికి ఈ ఆటను పరిచయం చేసిన వ్యక్తి రంజిత్ సింగ్ కుమార్. ఆయన పేరుతోనే,ఈ ట్రోఫీని రంజీ ట్రోఫీగా పేరు పెట్టారు.ఈ ట్రోఫీ ఇప్పటికీ కొనసాగుతుంది.రంజిత్ సింగ్, తన ఆటతో బ్రిటిష్ క్రికెట్‌ను కూడా ఆకట్టుకున్నారు. అందుకే, ఆయనను భారత క్రికెట్‌కు పితామహుడిగా పిలుస్తారు.
రంజిత్ సింగ్ ఎవరు?
రంజిత్ సింగ్ 1872 సెప్టెంబర్ 10న పంజాబ్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు.ఆయనకు నవనగర్ రాజు బీభా సింగ్ కుటుంబంతో సంబంధం ఉంది. 1878లో రాజు పాత్రను చేపట్టి, రంజిత్ సింగ్ విద్య కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ, క్రికెట్ లో ఉన్న ఆసక్తితో ససెక్స్, లండన్ కౌంటీలకు ఆడారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో చేరి, ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో పాల్గొన్నాడు.
ఈజీగా అవకాశం పొందలేకపోయారు!
రంజిత్ సింగ్‌కు ఇంగ్లాండ్ జట్టులో స్థానం పొందడం అంత సులభం కాలేదు. స్వాతంత్య్రం ముందు భారతీయులను బ్రిటిష్ జాతి వారు, నల్లజాతీయులుగా పరిగణించేవారు. అందుకే, రంజిత్ సింగ్ చాలా కష్టపడి, తన ప్రతిభతో ఇంగ్లాండ్ జట్టులో చోటు సంపాదించాడు. చివరికి, ఓల్డ్ ట్రాఫోర్డ్ లో తన రెండో టెస్టు ఆడాడు, ఇందులో తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. అప్పుడు, రంజిత్ సింగ్ పేరు ప్రజల నోట నిలిచిపోయింది.
భారత్ తరఫున ఎందుకు ఆడలేకపోయారు?
రంజిత్ సింగ్ ఇంగ్లాండ్ జట్టులో 15 టెస్టులు ఆడి, 989 పరుగులు సాధించారు. 307 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 24,692 పరుగులు సాధించారు, ఇందులో 72 సెంచరీలు, 109 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, భారత్ లో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేకపోయారు. ఎందుకంటే, అప్పటివరకు భారత్ కు టెస్టు జట్టు లేదు. భారత్ 1932లో టెస్టు మ్యాచ్‌లను ఆడింది. రంజిత్ సింగ్ మరణం: 1933లో రంజిత్ సింగ్ కన్నుమూశారు. 1934లో బీసీసీఐ 'ఇండియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్' అనే టోర్నమెంట్ ప్రారంభించింది, 1935లో దీనికి రంజిత్ సింగ్ పేరు మీదుగా "రంజీ ట్రోఫీ" అని పేరు పెట్టారు.