
Revanth Reddy: ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం రెండు ఏళ్లలో పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ భవన నిర్మాణంపై సీఎం ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు.
ఆదేశాలు
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనికి సంబంధించి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదనపు అధునాతన పరికరాలు పెట్టడానికి తగిన గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణాలు ఉండేలా ఇంజనీరింగ్ శాఖకు మార్గనిర్దేశం చేశారు. ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖలతో సమన్వయ కమీటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమీటీ క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి, ప్రతి పది రోజులకోసారి సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించుకుని పనులను వేగవంతంగా నడిపించాలని సీఎం సూచించారు.
వివరాలు
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు…
నూతన ఆసుపత్రి పూర్తైన తర్వాత బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, ఆసుపత్రికి అనుసంధానమయ్యే వివిధ రహదారుల ప్రణాళికలును ఇప్పటినుంచే రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల ప్రతి నిర్మాణానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా ఆదేశించారు. నిర్మాణాలపై 24x7 ఆ అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని చెప్పారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
వివరాలు
ఇటీవలే పనులు ప్రారంభం:
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులు దసరా పండుగ రోజునే ప్రారంభమయ్యాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ప్రాజెక్టుల విభాగం అధ్యక్షుడు కె. గోవర్ధన్ రెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియం ప్రాంతంలో ఈ కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, దసరా నాడు నిర్మాణ పనులు ప్రారంభించారు.
వివరాలు
నూతన భవనాల విశేషాలు:
నిర్మాణం రెండు మరియు అర ఏళ్లలో పూర్తి కానుంది. భవన సముదాయం 26 ఎకరాల విస్తీర్ణంలో, 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో అభివృద్ధి చేయబడుతుంది. ఇందులో 2,000 పడకల ఏర్పాటు ఉంటుంది. హాస్పిటల్ బ్లాక్: 22.96 లక్షల చదరపు అడుగులు అకడమిక్ బ్లాక్, పురుష/మహిళా వసతి గృహాలు, ధర్మశాల, యుటిలిటీ బిల్డింగ్, సెక్యూరిటీ బిల్డింగ్: 9.04 లక్షల చదరపు అడుగులు బేస్‌మెంట్ పార్కింగ్: రెండు అంతస్తులు, 1,500 కార్ల కోసం
వివరాలు
ఆసుపత్రి సౌకర్యాలు:
29 ప్రధాన, 12 చిన్న ఆపరేషన్ థియేటర్లు హెలిప్యాడ్, రోబోటిక్ సర్జరీ, ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్లు సీవేజ్ ట్రీట్మెంట్, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు రూఫ్‌టాప్ టెర్రస్ గార్డెన్లు, క్రాస్ వెంటిలేషన్ టెక్నాలజీతో సహజ గాలి ప్రవాహం, సౌకర్యవంతమైన వాతావరణం ఈ నిర్మాణం ద్వారా ఉస్మానియా ఆసుపత్రి ఆధునిక, సమగ్ర, రోగులకు సౌకర్యవంతమైన హెల్త్ కేర్ కేంద్రంగా మారనుంది.