Page Loader
IPL: ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడిన క్రికెటర్లు .. ఎవరంటే? 
ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడిన క్రికెటర్లు .. ఎవరంటే?

IPL: ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడిన క్రికెటర్లు .. ఎవరంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేక క్రికెటర్లకు పేరు ప్రఖ్యాతలు తెచ్చింది. 2008లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ద్వారా అనేక మంది క్రికెటర్లు తమ ప్రతిభను చాటుకున్నారు. కొందరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో స్టార్ ఆటగాళ్లుగా కొనసాగుతుండగా, మరికొందరు మాత్రం ఐపీఎల్‌లో అవకాశాలు వచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే, ఈ రెండు కేటగిరీల కంటే విభిన్నంగా, ఐపీఎల్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన ప్లేయర్లు కూడా ఉన్నారు. ఈ ఆటగాళ్లు ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినా, ఐపీఎల్‌లో మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు ఆ ప్రత్యేక ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

వివరాలు 

షోయబ్ అక్తర్ 

క్రికెట్ ప్రపంచంలో 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అని పిలిచే షోయబ్ అక్తర్, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. తన మొదటి మ్యాచ్‌లోనే దిల్లీ డేర్‌డెవిల్స్‌పై అద్భుతమైన బౌలింగ్‌తో చరిత్ర సృష్టించాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చి, 4 వికెట్లు సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపించి, తన ప్రతిభను చాటుకున్నాడు. కానీ 2008లో ముంబయి పేలుళ్ల తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లపై నిషేధం విధించబడింది. దీంతో అక్తర్ మళ్లీ ఐపీఎల్‌లో కనిపించలేదు.

వివరాలు 

యూనిస్ ఖాన్ 

పాకిస్థాన్ సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్ యూనిస్ ఖాన్, ఐపీఎల్ 2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం ఉన్నప్పటికీ, యూనిస్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా కేవలం 3 పరుగులకే పరిమితమయ్యాడు. ఆండ్రే నెల్ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఆండ్రే నెల్ తన ఆగ్రహం, దూకుడైన బౌలింగ్, స్లెడ్జింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ముంబయి ఇండియన్స్‌ అతన్ని తొలి సీజన్‌లో తమ జట్టులో చేర్చుకుంది. అభిమానులు అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ నెల్ కూడా కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. మూడు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ తీసుకున్నాడు.