Page Loader
Ranji Trophy: రంజీ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్,జై స్వాల్ ,గిల్ 
రంజీ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్,జై స్వాల్ ,గిల్

Ranji Trophy: రంజీ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్,జై స్వాల్ ,గిల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు (టీం ఇండియా) న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో మంచి ప్రదర్శన చేయకపోయినా ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి రంజీ బరిలోకి దిగారు. విరాట్ కోహ్లీ తప్ప, రోహిత్ శర్మ, పంత్, శుభ్‌మన్ గిల్, యశస్వి, జడేజా తదితరులు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొన్నారు. కానీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తడబడినట్లు వారు ఇక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్రీజ్‌లో నిలబడి ఎక్కువ సేపు ఆడాలని వారిలో పెద్దగా కనిపించలేదు. రంజీ ట్రోఫీ 2025 ఎలైట్ మ్యాచుల్లో, తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కావడం అభిమానులకు పెద్ద నిరాశను కలిగించింది.

వివరాలు 

యశస్వి 4, రోహిత్ 3 

జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో, ముంబయి తరఫున ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు. మొదటి రెండు ఓవర్లు ఓర్పుతో ఆడారు. దూకుడుగా ఆడాలని భావించిన సమయంలో జైస్వాల్ (4) ఔటయ్యాడు. 19 బంతులు ఎదుర్కొన్న రోహిత్ (3) ఒక చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. షార్ట్ పిచ్ బంతిని ఆడే ప్రయత్నంలో అతడు మిడాఫ్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానె (12) శ్రేయస్ అయ్యర్ (11) కూడా క్రీజ్‌లో ఎక్కువసేపు నిలబడలేదు. ఫలితంగా, 50 పరుగులకే ముంబయి ఏడు వికెట్లను కోల్పోయింది.

వివరాలు 

గిల్ 4, పంత్ 1 

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రంజీ ట్రోఫీలో అతడు పంజాబ్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.అయితే,అతడు 8బంతులు ఆడిన తర్వాత 4పరుగులకే ఔటయ్యాడు. కర్ణాటక బౌలర్ల దెబ్బకు పంజాబ్ కూడా 30పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక,సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ జట్టు కూడా పోరాడుతోంది. యశ్ ధుల్(44),కెప్టెన్ ఆయుష్ బదోని (35*)దూకుడుగా ఆడారు,కానీ దిల్లీ 100పరుగుల మార్క్‌ను దాటగానే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత, భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (1)బరిలోకి దిగాడు. విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.పంత్ (10 బంతులు) ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరాడు.