ఉత్తరాఖండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన కర్ణాటక
2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్‌పై సంచనల విజయంతో కర్ణాటక సెమీ ఫైనల్‌కు చేరుకుంది. కర్ణాటక విజయంలో శ్రేయాస్ గోపాల్, మురళీధర్ వెంకటేష్, కీలక పాత్ర పోషించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఉత్తరాఖండ్‌ను 116 పరుగులకే కర్ణాటక బౌలర్లు అలౌట్ చేశారు. శ్రేయాస్ గోపాల్ సెంచరీతో చేయడంతో కర్ణాటక 606 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. మురళీధర వెంకటేష్ ఐదు వికెట్లు తీసి ఉత్తరాఖండ్ బ్యాటర్ల నడ్డివిరిచాడు. దీంతో ఉత్తరాఖండ్ తమ చివరి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు మాత్రమే చేయగలిగింది.
శ్రేయాస్ గోపాల్, మయాంక్ అగర్వాల్ సాధించిన రికార్డులివే
గోపాల్ 288 బంతుల్లో 161 పరుగులతో అజేయంగా నిలిచాడు. గోపాల్ ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో తన ఐదోవ సెంచరీని చేశాడు. ఈ ఫార్మాట్‌లో 13 అర్ధ సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. గోపాల్ 75 మ్యాచ్ లు ఆడి 3వేల పరుగులను సాధించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్ బౌలింగ్ కూడా ఈ మణికట్టు-స్పిన్నర్ 200కి పైగా వికెట్లు సాధించాడు. కర్ణాటక కెప్టెన్ మయాంక్ కేవలం 109 బంతుల్లో 12 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 83 పరుగులు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 6,500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 89 మ్యాచ్లో 45.1 సగటుతో 6,540 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలో 68.6 సగటుతో 686 పరుగులు చేశాడు.