Page Loader
సెమీస్‌లో సమరానికి సిద్ధమైన బెంగాల్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కర్నాటక
ఈ సీజన్‌లో అభిమన్యు ఈశ్వరన్ 738 పరుగులు చేశాడు

సెమీస్‌లో సమరానికి సిద్ధమైన బెంగాల్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కర్నాటక

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2023
06:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ దశ పూర్తి అయింది. బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, సౌరాష్ట్ర, కర్ణాటక జట్లు ప్రస్తుతం సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 8న ప్రారంభం కానున్నాయి. అయితే ఇంతవరకు వేదికలు నిర్ణయించకపోవడం గమనార్హం. తొలి సెమీస్‌లో బెంగాల్, మధ్యప్రదేశ్‌ తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్‌లో సౌరాష్ట్ర, కర్ణాటక సమరానికి రెడీ అయ్యాయి. ఫైనల్ పోరు ఫిబ్రవరి 16న ప్రారంభం కానుంది. అయితే కర్నాటక జట్టు అత్యధికంగా 8సార్లు రంజీ ట్రోఫీని ఎగురేసుకొని పోయింది. బెంగాల్ రెండుసార్లు ట్రోఫిని గెలుపొందగా.. సౌరాష్ట్ర ఒక్కసారి ట్రోఫిని కైవసం చేసుకుంది.

అభిమన్యు ఈశ్వరన్

బెంగాల్ తరుపున అత్యధిక పరుగులు చేసిన అభిమన్యు ఈశ్వరన్

క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్‌పై బెంగాల్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. బెంగాల్ తరుపున అభిమన్యు ఈశ్వరన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పేసర్ ఆకాశ్‌దీప్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 31 వికెట్లు తీసి బెంగాల్‌ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్రపై మధ్యప్రదేశ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హిమాన్షు ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో 558 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బౌలింగ్ విభాగంలో పేసర్ అవేష్ ఖాన్ అద్భుతంగా రాణించి మధ్యప్రదేశ్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్‌పై కర్నాటక 181 పరుగుల తేడాతో విజయం సాధించింది.