LOADING...
ఆంధ్రాపై విజయం సాధించి సెమీస్‌కు చేరిన మధ్యప్రదేశ్
ఆంధ్రా 2వ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అవేష్ ఖాన్

ఆంధ్రాపై విజయం సాధించి సెమీస్‌కు చేరిన మధ్యప్రదేశ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2023
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

రంజీ ట్రోఫీ 2022-23 క్వార్టర్ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్ ఆంధ్రపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. రికీభుయ్, కరణ్ షిండేల సెంచరీలతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసింది. అయితే 2వ ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 93 ​​పరుగులకే ఆలౌటైంది. భుయ్ 149, షిండే 110 పరుగులు చేసి 265 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ లో భారీ పరుగులు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన బౌలర్ అగర్వాల్ 4/72తో నిలిచారు. అదేవిధంగా అవేష్ ఖాన్ కీలక వికెట్లు తీశారు. హనుమ విహారికి మొదటి ఇన్నింగ్స్‌లో మణికట్టు ఫ్రాక్చర్ అయింది. ఎడమ చేతితో బ్యాటింగ్ దిగి 2వ ఇన్నింగ్స్‌లో ఆంధ్రా తరఫున పోరాటం చేశాడు.

రికీ భుయ్

ఎఫ్‌సి క్రికెట్లో 14వ సెంచరీని నమోదు చేసిన రికీ భుయ్

ఆంధ్ర వికెట్ కీపర్-బ్యాటర్ రికీ భుయ్ ఆంధ్రా తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో రాణించాడు. అతను 250 బంతుల్లో 149 పరుగులు చేసి ఎఫ్‌సి క్రికెట్లో 14వ సెంచరీని చేసిన ఆటగాడిగా నిలిచాడు. భుయ్ ఇప్పటివరకు 61 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 3,828 పరుగులు చేశాడు. 2022-23 రంజీ సీజన్ 43.64 సగటుతో 611 పరుగులు చేశాడు. ఆంధ్రా తొలి ఇన్నింగ్స్‌లో షిండే 264 బంతుల్లో 110 పరుగులు చేశాడు. షిండే ఎఫ్‌సి క్రికెట్లో తన మూడో సెంచరీని నమోదు చేశాడు. మధ్య ప్రదేశ్ తరుపున శుభంవర్మ 8 మ్యాచ్‌లు ఆడి 44.25 సగటుతో 531 పరుగులు చేశాడు. అదే విధంగా దూబే 2022-23 రంజీలో 4వ అర్ధశతకాన్ని పూర్తి చేశాడు.