LOADING...
ఇరానీ కప్‌లో సెంచరీలతో అదరగొడుతున్న యశస్వి జైస్వాల్
ఇరానీ కప్‌లో సెంచరీలు బాదేస్తున్న యశస్వి

ఇరానీ కప్‌లో సెంచరీలతో అదరగొడుతున్న యశస్వి జైస్వాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2023
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఇరానీ కప్‌లో అదరగొడుతున్నాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తరుపున బరిలోకి దిగిన యశస్వి.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెలరేగిపోయాడు.అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ (259 బంతుల్లో 213) రెండో ఇన్నింగ్స్ లో (132 బంతుల్లో 121 నాటౌట్) తో దుమ్ము లేపుతున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం యశస్వి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇటీవల దేశవాళీ క్రికెట్లో విజృంభిస్తున్న యశస్వి.. పలు సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తున్నాడు. దీంతో టీమిండియా ఓపెనర్ రేసులో తాను ఉన్నానంటూ భారత సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు.

యశస్వి జైస్వాల్

యశస్వి జైస్వాల్ సాధించిన రికార్డులివే

జైస్వాల్ తన ఎఫ్‌సి కెరీర్‌లో 1,800 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అతని సగటు 75 కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ ఫార్మాట్లో తొమ్మిది సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 265 పరుగులు చేశాడు. ఇరానీ కప్ లో ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసి తొలి బ్యాట్‌మెన్స్‌గా అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ మైలురాయిని సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా ఇరానీ కప్ లో ఒకే మ్యాచ్‌లో 300 ప్లస్ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ నమోదు చేసిన 11వ భారత క్రికెట్‌గా రికార్డుల్లోకెక్కాడు.