Page Loader
ఇరానీ కప్‌లో తలపడనున్న మధ్యప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా
రెస్ట్ ఆఫ్ ఇండియాకి కెప్టెన్‌గా నియమితులైన మయాంక్ అగర్వాల్

ఇరానీ కప్‌లో తలపడనున్న మధ్యప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2023
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో మార్చి 1 నుంచి మధ్య ప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా టీం మధ్య ఇరానీ కప్ టోర్నీ జరగనుంది. రంజీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన మిగిలిన జట్ల ప్లేయర్లను ఓ టీమ్‌‌గా చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌గా, రంజీ ట్రోఫీ విజేతతో ఇరానీ కప్ జరుగుతుంది 2021-22 సీజన్లో రంజీ ట్రోఫీ నిర్వహించినా కొన్ని కారణాల వల్ల ఇరానీ ట్రోఫీని నిర్వహించలేదు. 2021-22 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచిన మధ్య ప్రదేశ్ జట్టుతో రెస్ట్ ఆఫ్ ఇండియా తలపడనుంది. కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఉదయం 9.30గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఇరానీ కప్

ఇరు జట్లలోని సభ్యులు వీరే

మధ్యప్రదేశ్ టీమ్‌కి హిమాన్షు మంత్రి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మధ్యప్రదేశ్ కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవ వ్యక్తిగత కారణాలతో ఇరానీ కప్‌కి దూరమయ్యాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో కర్ణాటక టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ రెస్ట్ ఆఫ్ ఇండియాకి నాయకత్వం వహించనున్నాడు. మధ్యప్రదేశ్ ఇండియా జట్టు: యష్‌దూబే, హిమాన్షు మంత్రి (కెప్టెన్), సరాంశ్‌జైన్, అనుభవ్అగర్వాల్, అక్షత్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, అక్షత్ రఘువంశీ, శుభం శర్మ, కుమార్ కార్తికేయ, అవేష్ ఖాన్, గౌరవ్ యాదవ్ రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు : మయాంక్‌అగర్వాల్ (C), యశస్వి‌జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, యష్ ధుల్, బాబా ఇంద్రజిత్, ఉపేంద్ర యాదవ్ (WK), అతిత్ షేత్, సౌరభ్ కుమార్, ఆకాష్ దీప్, ముఖేష్ కుమార్, చేతన్ సకారియా