Irani Cup: 33 ఏళ్ల రికార్డును ఇరానీ కప్‌లో బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్
ముంబై యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇరానీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ టోర్నిలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరుపున బరిలోకి దిగిన జైస్వాల్.. 33 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. మార్చి 1న మధ్యప్రదేశ్ జరిగిన ప్రారంభ మ్యాచ్ లో 230 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా ఇరానీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా సంచలన రికార్డును క్రియేట్ చేశాడు. అదే విధంగా ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా రెస్టాఫ్ ఇండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్ చరిత్రకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 259 బంతులు ఎదుర్కొన్న యశస్వి.. 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 213 పరుగులు చేసి ఔటయ్యాడు.
యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ
తొలిరోజు మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 87 ఓవర్లలో 381 పరుగుల భారీ స్కోరు చేసింది. యశస్వికి బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (154) తోడయ్యాడు. వీరిద్దరూ శతకాలతో విజృంభించారు గతంలో ఈ రికార్డ్ ప్రవీణ్ ఆమ్రే పేరుమీద ఉంది. 1990లో ప్రవీణ్ 22 ఏళ్లలో ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం 21 ఏళ్లకే ఈ ఘనతను సాధించిన క్రికెటర్‌గా యశస్వి రికార్డును బ్రేక్ చేశాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఈశ్వరన్ రనౌటయ్యాడు. దులీప్ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే