Ranji Trophy: సంచలన చరిత్రను సృష్టించిన జమ్ముకశ్మీర్.. తొలి రంజీ ట్రోఫీ కైవసం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి సారి టైటిల్ గెలిచింది. హుబ్లీలోని కేఎస్సీఏ స్టేడియం (KSCA Stadium) వేదికగా కర్ణాటకతో డ్రా అయిన ఫైనల్‌లో, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న జమ్ముకశ్మీర్ జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం ప్రత్యేకం ఎందుకంటే, ఇది జట్టు తొలి ఫైనల్ ప్రదర్శన, అలాగే టోర్నమెంట్ చరిత్రలో మొదటి ఫైనల్‌లోనే టైటిల్ గెలిచిన తొమ్మిదో జట్టుగా నిలిచింది.
Details
శుభమ్ పుందీర్ శతకం
జట్టు ఓపెనర్ శుభమ్ పుందీర్ (Shubham Pundir) కీలక శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. యావర్ హసన్‌తో కలిసి రెండో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జమ్మూ & కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులు నమోదు చేసింది. మొత్తం రెండు శతక భాగస్వామ్యాలు, మూడు అర్ధశతక భాగస్వామ్యాలతో జట్టు అద్భుత ప్రదర్శనను అందించింది.
Details
బౌలింగ్‌లో ఆకిబ్ నబీ మెరుపులు
బౌలింగ్‌లో ఆకిబ్ నబీ (Auqib Nabi) అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో ఏడోసారి ఐదు వికెట్లు సాధించి కర్ణాటక బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. 585 పరుగుల లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ఆడిన కర్ణాటకకు తొలి దెబ్బ నబీనే రుచి చూపించాడు. రెండో రోజు లంచ్‌కు ముందు కేఎల్ రాహుల్ వికెట్ తీశాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్, ఆర్. స్మరణ్ వికెట్లను వరుసగా పడగొట్టి జట్టును కష్టాల్లోకి నెట్టాడు. కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 266 బంతుల్లో 160 పరుగులు చేసినప్పటికీ, జట్టు 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటును పూరించలేకపోయింది.
Details
రెండో ఇన్నింగ్స్‌లోనూ జమ్ముకశ్మీర్ ఆధిపత్యం
భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్ముకశ్మీర్, చివరి రోజు కూడా దూకుడును కొనసాగించింది. కమ్రాన్ ఇక్బాల్, సహిల్ లోట్రా శతకాలతో జట్టును విజయదిశగా నడిపించారు. పరాస్ డోగ్రా నాయకత్వంలో చరిత్ర పరాస్ డోగ్రా (Paras Dogra) నాయకత్వంలోని జమ్ముకశ్మీర్ జట్టు ఎనిమిది సార్లు చాంపియన్ అయిన కర్ణాటకను నిలువరించి చరిత్ర సృష్టించింది. తొలి ఫైనల్‌లోనే టైటిల్ సాధించడం జట్టులోని ప్రతిభకు నిదర్శనం.