Shreyas Iyer: ముంబై రంజీ జట్టు ప్రకటన.. శ్రేయాస్ అయ్యర్‌కు మళ్లీ నిరాశే.. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఖాయం
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టీమ్‌ఇండియాలో ఆడే అవకాశాలు తగ్గిపోయినట్టే కనిపిస్తున్నాయి. అక్టోబర్ 16 నుంచి భారత్, న్యూజిలాండ్ (IND vs NZ)ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత టెస్టు జట్టులో తిరిగి చేరాలని ఆశించిన శ్రేయస్‌కు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. కారణం,అతడిని రంజీ ట్రోఫీ కోసం ఎంపిక చేయడమే.అతడు ముంబయి రంజీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో,కివీస్ సిరీస్‌లో సర్ఫరాజ్‌ఖాన్ (Sarfaraz Khan)ఎంపికకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది ప్రారంభంలో విశాఖపట్టణంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు అతడి చివరి మ్యాచ్ కాగా, ఆ మ్యాచ్‌లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఫలితంగా మిగిలిన మూడు మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం జట్టులో చోటు దక్కించుకునే అవకాశం
29 ఏళ్ల శ్రేయస్ ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో ఇండియా తరపున ఆడినా, కేవలం 154 పరుగులు మాత్రమే సాధించాడు. ఇరానీ కప్‌లో ముంబయి తరపున మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం బాదిన శ్రేయస్, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 8 పరుగులకే ఔటయ్యాడు. రంజీ ట్రోఫీలో అతడు మెరుగ్గా రాణిస్తే, నవంబర్‌లో ప్రారంభం కానున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రంజీ ట్రోఫీలో అతడు ఏ విధంగా ఆడతాడో చూడాల్సి ఉంది.
రంజీ ట్రోఫీ కోసం ముంబయి జట్టు (మొదటి రెండు మ్యాచ్‌లకు)ఇదే..
ఇదే సమయంలో, ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్‌ఖాన్‌ను రంజీ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంతో అతడిని న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సర్ఫరాజ్ ఇటీవల ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు అతడు ఎంపికయ్యినా, దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్ కోసం అతడిని జట్టు నుంచి విడుదల చేశారు. అజింక్య రహానె (కెప్టెన్), పృథ్వీ షా, ఆయుష్ మ్హత్రే, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, సూర్యాంశ్ షెడ్గే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సిధాంత్ (వికెట్‌కీపర్), శామ్స్ ములానీ, తనుష్ కొటియన్, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, మహ్మద్ జునైద్ ఖాన్, రాయ్స్టన్.