
IPL 2025 : ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిచేది వీరిద్దరే.. కావాలంటే రాసి పెట్టుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025)సీజన్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ,ఇప్పటి నుంచే టైటిల్ గెలుచే జట్టు గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న అంగరంగ వైభవంగా ప్రారంభంకానుంది. గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవగా,సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది.
అయితే,ఈసారి కేకేఆర్ టైటిల్ గెలవగలదా.. అన్నదే సందేహంగా మారింది.ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ లలో ఒకటి గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ రెండు జట్లు ఇప్పటికే ఐదేసి సార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లే.ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే,చివరిసారిగా 2020లో ఐపీఎల్ టైటిల్‌ను గెలిచింది.
వివరాలు
ముంబైని ఓడించడం ప్రత్యర్థి జట్లకు కష్టతరమైన పని
ఆ తర్వాత తిరిగి టైటిల్‌ను దక్కించుకోలేకపోయింది. గత సీజన్లలో బ్యాటింగ్ బలంగా ఉన్నా, బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటంతో ముంబై టైటిల్ రేసులో నిలవలేకపోయింది.
కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశముంది. వేలంలో బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరిచేందుకు ముంబై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యాలు అద్భుత ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మిచెల్ సాంట్నర్ ప్రధాన స్పిన్నర్‌గా జట్టులో ఉండనున్నాడు. ఇక బ్యాటింగ్‌లో ముంబైకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ఆటగాళ్లు ఉన్నారు.
రోహిత్ శర్మ,సూర్యకుమార్ యాదవ్,హార్దిక్ పాండ్యా,తిలక్ వర్మలతో బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది.
ఈ కారణంగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబైని ఓడించడం ప్రత్యర్థి జట్లకు కష్టతరమైన పని కానుంది.
వివరాలు
ధోనీ ఉండటం చెన్నైకి అదనపు బలం
చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే,ఆ జట్టుకు ప్రధాన బలం ఎంఎస్ ధోనీ.రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ తమ మిగిలిన జట్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది.
జడేజా,రవిచంద్రన్ అశ్విన్ లు చెపాక్ స్టేడియంలో మ్యాజిక్ చేయగలరు.వీరికి నూర్ అహ్మద్ తోడైతే, చెపాక్ స్టేడియంలో ప్రత్యర్థి జట్లు ఒత్తిడికి లోనవుతాయి.
బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర,డెవోన్ కాన్వే ఇప్పటికే జట్టులో ఉన్నారు.శివమ్ దూబే రూపంలో చెన్నైకు భారీ షాట్లు ఆడే ఆటగాడు దొరికాడు.
ధోనీ ఉండటం చెన్నైకి అదనపు బలంగా మారుతుంది.
ఈ రెండు జట్లతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్,పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు కూడా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.