
ENG vs IND : సిరీస్ 2-2 అయితే ట్రోఫీ ఎవరిదీ? అభిమానుల్లో ఆసక్తికర చర్చ!
ఈ వార్తాకథనం ఏంటి
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ క్రింద భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో చివరి టెస్టు మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్ట్ 4 వరకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఈ నిర్ణయాత్మక టెస్టులో భారత్ విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ గెలిచి సిరీస్‌ను 3-1తో గెలుచుకోవాలన్నా లేదా డ్రాగా ముగించి 2-1తో ట్రోఫీని నిలుపుకోవాలన్నదే వారి ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ అభిమానుల మధ్య నడుస్తోంది. సిరీస్ 2-2తో డ్రాగా ముగిస్తే ట్రోఫీ ఎవరి వద్ద ఉండబోతోంది? అంటే దీనిపై స్పష్టత లేదు.
Details
అధికారిక ప్రకటన చేయలేదు
సాధారణంగా ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు డ్రాగా ముగిస్తే.. గత సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్టు ట్రోఫీని కలిగి ఉంటుంది. గతంలో ఈ సిరీస్‌కు 'పటౌడీ ట్రోఫీ' అని పేరు ఉండేది. 2021లో జరిగిన సిరీస్ డ్రాగా ముగిసినా, 2018లో ఇంగ్లాండ్ గెలిచిన కారణంగా ట్రోఫీ అక్కడే కొనసాగింది. ఇప్పుడు సిరీస్ పేరు 'అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ'గా మార్చారు. ఈ నేపథ్యంలో ట్రోఫీని ఏ జట్టు తీసుకుంటుంది? డ్రా అయితే పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారా? లేదా కొత్త నియమాలు అమలవుతాయా? అన్నది ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి బీసీసీఐ కానీ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కానీ ఈకొత్త ట్రోఫీకి సంబంధించి డ్రా జరిగితే ట్రోఫీ ఎవరిదన్న విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు