Arshdeep Singh: అర్ష్‌దీప్‌ను ఎందుకు బెంచ్‌లో పెట్టారో అతడికే తెలుసు: మోర్కెల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌లో ఉంచడం గట్టి చర్చకు దారితీసింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు వందకుపైగా వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ అయినప్పటికీ, అతడిని ఆడనివ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆపై మేనేజ్‌మెంట్ అతడిని మూడో మ్యాచ్‌లో చేర్చగా, ఆ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి భారత జట్టుకు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఎందుకు తొలి జట్టులో అవకాశం రాలేదో అర్ష్‌దీప్ ఇప్పటికే అర్థం చేసుకున్నాడని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పాడు. గురువారం క్వీన్స్‌లాండ్‌లో జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా నాలుగో టీ20 కు ముందు మోర్కెల్ ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు.
వివరాలు
పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న ప్రపంచ స్థాయి బౌలర్
''అర్ష్‌దీప్ అనుభవజ్ఞుడు. మా జట్టు కూర్పు ఏ విధంగా ఉందో అతడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న ప్రపంచ స్థాయి బౌలర్ అని మాకు తెలుసు. ఈ పర్యటనలో మేము భిన్నమైన కాంబినేషన్లను పరీక్షిస్తున్నాం. అందుకే తొలి మ్యాచ్‌ల్లో అతడికి అవకాశం రాలేదు. ఇది అతడూ అంగీకరించాడు. టీ20 ప్రపంచ కప్ ముంగిట.. ''జట్టు ఎంపిక అనేది మేనేజ్‌మెంట్‌కే కాదు,ఆటగాళ్లకూ కఠినంగానే ఉంటుంది. 2026 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని,వివిధ కూర్పులను పరీక్షిస్తున్నాం.కొన్నిసార్లు ఆడే అవకాశం రాకపోవడం వల్ల ఆటగాళ్లు నిరుత్సాహపడడం సహజమే. కానీ మేము వారిని ఇంకా శ్రమించేలా ఉత్సాహపరుస్తాం. ఎప్పుడు అవకాశం వచ్చినా మెరుగైన ప్రదర్శన ఇవ్వగల స్థితికి తీసుకువెళ్తాం"అని పేర్కొన్నాడు.
వివరాలు
టీ20 ప్రపంచ కప్ ముంగిట..
వచ్చే ప్రపంచకప్‌కు ముందే చాలా తక్కువ మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లో ఎవరు ఎలా రాణిస్తారన్నది మాకు ముఖ్యంగా కనిపిస్తోంది. ఆటగాళ్ల ప్రతిభపై మాకు ఎలాంటి అనుమానం లేదు. మా దృష్టి అన్ని పరిస్థితుల్లో జట్టు ఎలా గెలుస్తుందన్నదానిపైనే ఉంది'' అని మోర్కెల్ వివరించాడు.