
Roger Binny: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నరోజర్ బిన్నీ.. అయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)అధ్యక్ష స్థానంలో కీలక మార్పులు జరగనున్నట్లు సమాచారం.
ప్రస్తుత అధ్యక్షుడు,1983లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ త్వరలో తన పదవికి గుడ్‌బై చెప్పనున్నారు.
వయోపరిమితి కారణంగా త్వరలో పదవి నుంచి వైదొలగనున్నారు.
దీంతో ఆయన స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసేందుకు బీసీసీఐ ఉపాధ్యక్షుడైన రాజీవ్ శుక్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ విధానాల ప్రకారం, అధ్యక్ష పదవికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.
రోజర్ బిన్నీ ఈ ఏడాది జూలై 19న 70వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.
ఈనిబంధనల ప్రకారం ఆయన పదవిలో కొనసాగలేరు.
ఆయన పదవీ విరమణ అనంతరం,కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.
వివరాలు
1983 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర
ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా,సుమారు మూడు నెలల పాటు తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
ఈ కాలంలో బోర్డు రోజువారీ నిర్వహణను పర్యవేక్షించడమే కాకుండా, కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను సజావుగా నడిపించే బాధ్యతను కూడా నిర్వర్తిస్తారు.
2022లో సౌరబ్ గంగూలీ స్థానాన్ని భర్తీ చేస్తూ, రోజర్ బిన్నీ బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఆటగాడిగా ఆయన భారత జట్టుకు గొప్ప సేవలందించారు.
బిన్నీ 27 టెస్టులు,72 వన్డేలు ఆడి, మొత్తం 124 వికెట్లు తీశారు. ముఖ్యంగా 1983 ప్రపంచకప్ విజయానికి ఆయన బలమైన కారణంగా నిలిచారు.
ఆ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా పేరు తెచ్చుకుని భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.