Page Loader
టెస్టులో వైస్ కెప్టెన్‌గా అశ్విన్‌కు అవకాశం ఇవ్వాలి..!
టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్

టెస్టులో వైస్ కెప్టెన్‌గా అశ్విన్‌కు అవకాశం ఇవ్వాలి..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2022
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

రవిచంద్రన్ అశ్విన్ ఓ గొప్ప ఫైటర్.. భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్‌ రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. భారత్ టెస్టు వైస్‌కెప్టెన్‌గా ఎందుకు అశ్విన్‌ను నియమించలేదన్న చాలామంది హృదయాల్లో నెలకొన్న ప్రశ్న..? టెస్టులో 400పైగా వికెట్లు తీసి, 3000 పైగా రన్స్ చేసిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో కపిల్‌దేవ్ తర్వాత రెండో భారతీయుడి ఇతడే. కొత్తగా వచ్చిన ప్లేయర్లకు కెప్టెన్, వైస్‌కెప్టెన్‌గా నియమిస్తున్నా.. బీసీసీఐ ఎందుకు రవిచంద్రన్ అశ్విన్ దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత, రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించింది.

రవిచంద్రన్ అశ్విన్

ఈ ప్లేయర్లకు కెప్టెన్సీ ఎప్పుడు వస్తుందో..?

రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టును టెస్టుల్లో అనిల్ కుంబ్లే నడిపించి సక్సెస్ అయ్యాడు. కుంబ్లే వారసుడిగా రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టును నడిపించడంలో విజయవంతం అవుతాడని బీసీసీఐ భావిస్తోందట. భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అద్భుతంగా ఆడిన రవీంద్ర జడేజాకు కూడా ఇంతవరకూ కెప్టన్సీ అవకాశం రాలేదు. ఛతేశ్వర్ పుజారా భారత జట్టు తరుపున వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతన్ని కూడా బీసీసీఐ పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. అశ్విన్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. పైగా టీమిండియా సీనియర్ ఆటగాడు. పనిభారం, పిట్‌నెస్‌తో టెస్టుకు రోహిత్, బుమ్రా, రాహుల్ అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్‌గా అశ్విన్ వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.