SRH vs PBKS: నల్ల బ్యాండ్లతో మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్… కారణం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు, ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడుతోంది. టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మ్యాచ్ ప్రారంభమైన వెంటనే ఆటగాళ్లు చేతులకు కట్టుకున్న నల్ల బ్యాండ్లు అభిమానుల్లో ఆందోళనకు దారి తీశాయి. ఈ చర్య వెనుక ఉన్న కారణం పంజాబ్‌కు చెందిన మాజీ క్రికెటర్, మాజీ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మిక మరణం. కేవలం 36 సంవత్సరాల వయస్సులోనే ఆయన మృతి చెందడం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది.
వివరాలు
పంజాబ్ క్రికెట్‌కు అమన్‌ప్రీత్ సేవలు అమూల్యం
అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణంపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ భావోద్వేగంతో స్పందించింది. ఆయన చేసిన సేవలు పంజాబ్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా ఉన్నాయని పేర్కొంది. భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, పంజాబ్ రాష్ట్ర జట్టులోనూ ప్రధాన ఆటగాడిగా గుర్తింపు పొందారు. క్రీడ పట్ల ఆయన చూపిన అంకితభావం, పట్టుదల భవిష్యత్ తరాల ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తాయి.
వివరాలు
ఐపీఎల్ ప్రయాణం, అనుబంధం ఇలా..
2009లో అమన్‌ప్రీత్ సింగ్ గిల్, అప్పట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌గా ఉన్న జట్టుతో తన తొలి ఐపీఎల్ ఒప్పందాన్ని చేసుకున్నారు. 2010 వరకు ఆ జట్టులో భాగమయ్యారు. ఆ సమయంలో యువరాజ్ సింగ్, మహేళ జయవర్ధనే, బ్రెట్ లీ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు. ఆ తర్వాత కూడా పంజాబ్ ఫ్రాంచైజీతో ఆయనకు గాఢమైన అనుబంధం కొనసాగింది. అందుకే ఆయనకు గౌరవార్థం ప్రస్తుత జట్టు సభ్యులు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు.
వివరాలు
విజయంపై దృష్టి పెట్టిన పంజాబ్..
ఇటీవలి రెండు పరాజయాల తర్వాత పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు దిశగా సాగాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోటీలో బ్యాటింగ్ విఫలమవడం జట్టుకు నష్టం కలిగించింది. ప్రస్తుతం పట్టికలో ముందంజలో ఉన్నప్పటికీ, హైదరాబాద్ వంటి బలమైన జట్టును వారి స్వస్థలంలో ఎదుర్కోవడం సవాలుగా మారింది. గత సీజన్‌లో తృటిలో చేజారిన టైటిల్‌ను ఈసారి సాధించాలనే సంకల్పంతో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు కృషి చేస్తోంది.
వివరాలు
సన్‌రైజర్స్ నుంచి కఠిన పోటీ..
ఇక ప్రత్యర్థి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా బలంగా ఉంది. పాట్ కమిన్స్ నాయకత్వంలో ఉన్న ఈ జట్టు వరుసగా ఐదు విజయాలు సాధించిన తర్వాత కోల్‌కతా చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం వారు పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. తమ సొంత మైదానంలో పంజాబ్‌ను నిలువరించి మళ్లీ విజయాల పంథాలోకి రావాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య పోటీ కేవలం గెలుపు కోసం మాత్రమే కాకుండా భావోద్వేగాలతో కూడినదిగా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..
Sabke chahite Yuzi! 🫶 pic.twitter.com/OVPxbTHUqk
— Punjab Kings (@PunjabKingsIPL) May 6, 2026