LOADING...
Shreyas Iyer: చాహల్‌ను ఎందుకు ఆడించలేదు..? విమర్శలపై శ్రేయస్ అయ్యర్ క్లారిటీ!
చాహల్‌ను ఎందుకు ఆడించలేదు..? విమర్శలపై శ్రేయస్ అయ్యర్ క్లారిటీ!

Shreyas Iyer: చాహల్‌ను ఎందుకు ఆడించలేదు..? విమర్శలపై శ్రేయస్ అయ్యర్ క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2026
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ స్కోర్ చేసినప్పటికీ, బౌలింగ్ విభాగంలో విఫలమవడంతో పంజాబ్‌కు నిరాశ ఎదురైంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో స్టార్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్‌ను పక్కన పెట్టడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చాహల్‌ను ఆడించకపోవడం మూర్ఖత్వపు నిర్ణయమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ధర్మశాల పిచ్‌పై దిల్లీ, పంజాబ్ జట్లు స్పిన్నర్లను పెద్దగా ఉపయోగించకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. 2023 నుంచి ఈ మైదానంలో పేసర్ల కంటే స్పిన్నర్లకే మెరుగైన ఎకానమీ రేట్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వివరాలు

లెగ్ స్పిన్నర్‌ను ఉపయోగించాలనే ఆలోచన మాకు ఉంది

అలాంటప్పుడు ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్, చాహల్ వంటి స్పిన్నర్లు బంతితో కనిపించకపోవడం నిజంగా ఓ పజిల్‌లా ఉందని వ్యాఖ్యానించారు. ఇక చాహల్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడంపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. లెగ్ స్పిన్నర్‌ను ఉపయోగించాలనే ఆలోచన మాకు ఉంది. అయితే మ్యాచ్ సమయంలో పరిస్థితులు సీమర్లకు అనుకూలంగా ఉన్నాయని అనిపించింది. అందుకే పేసర్లతోనే దాడి చేసి వికెట్లు తీసే ప్రణాళికలు రూపొందించాం. కానీ దురదృష్టవశాత్తూ ఆశించిన ఫలితం రాలేదని వివరించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

వివరాలు

కాస్త పొదుపుగా బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్

అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా, తర్వాత బ్యాటర్లు దూకుడుగా ఆడి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే యశ్ ఠాకూర్, యాన్సెస్, డ్వార్షుయిస్, స్టోయినిస్ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.

Advertisement