LOADING...
MS Dhoni: వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఉంటాడా..? సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు!
వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఉంటాడా..? సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు!

MS Dhoni: వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఉంటాడా..? సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు అత్యంత పెద్ద నిరాశగా మారింది. కారణంగా ఎంఎస్ ధోని గైర్హాజరు కావడమే. గాయం కారణంగా ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. చెన్నై జట్టు ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ, తదుపరి దశకు చేరే అవకాశాలు చాలా క్లిష్టంగా కనిపిస్తున్నాయి. లీగ్ దశలో సీఎస్కేకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉన్నా, అందులో కూడా ధోనీ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వచ్చే సీజన్‌లో అయినా ధోనీ మళ్లీ యెల్లో జెర్సీలో కనిపిస్తాడా? అన్న చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. ఈ అంశంపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు.

వివరాలు

మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంది

ధోనీ భవిష్యత్తుపై తుది నిర్ణయం పూర్తిగా జట్టు మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశాడు. "ధోనీ భవిష్యత్తు గురించి పెద్ద చర్చ జరుగుతోందని నాకు తెలుసు. ఈ సీజన్ మొత్తం అతడు జట్టుతో ఎక్కువ సమయం గడిపాడు. అది మాకు చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. మైదానంలో ఆడకపోయినా, జట్టుపై అతని ప్రభావం చాలా పెద్దది. ఈ ఏడాది మేం ఎన్నో ప్రయోగాలు చేశాం. కొత్త తరం ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాం. అయితే వచ్చే సీజన్‌లో ధోనీ ఆడతాడా లేదా అన్న నిర్ణయం నేను తీసుకునేది కాదు. అది పూర్తిగా మేనేజ్‌మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఫ్లెమింగ్ తెలిపాడు.

వివరాలు

మైదానంలోకి వచ్చి అభిమానులను పలకరించిన ధోని

ఇదిలా ఉండగా, సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ధోనీ మైదానంలోకి వచ్చి అభిమానులను పలకరించాడు. జట్టు సభ్యులతో కలిసి ఫొటోలు దిగుతూ అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చాడు. అదే సమయంలో సీఎస్కే మాజీ ఆటగాడు, ప్రస్తుతం వ్యాఖ్యాతగా కొనసాగుతున్న సురేశ్ రైనా ధోనీతో సరదాగా సంభాషించాడు. ఐపీఎల్ 2026లో మేం నిన్ను చాలా మిస్ అయ్యాం. వచ్చే ఏడాది తప్పకుండా ఆడాలని రైనా చెప్పగా, దానికి ధోనీ "శరీరం సహకరించడం లేదంటూ సమాధానం ఇచ్చాడు. అయితే రైనా వెంటనే స్పందిస్తూ, "అవన్నీ మేం నమ్మం.. వచ్చే సీజన్‌లో తప్పకుండా ఆడాల్సిందేనని నవ్వుతూ చెప్పాడు. చివరికి ధోనీ భవిష్యత్తుపై నిర్ణయం పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమేనని రైనా స్పష్టం చేశాడు.

Advertisement