Page Loader
Rafael Nadal: నాదల్ బరిలో దిగుతాడా? అభిమానుల్లో ఉత్కంఠ!
నాదల్ బరిలో దిగుతాడా? అభిమానుల్లో ఉత్కంఠ!

Rafael Nadal: నాదల్ బరిలో దిగుతాడా? అభిమానుల్లో ఉత్కంఠ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 19, 2024
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో స్పెయిన్, నెదర్లాండ్స్ జట్లు మంగళవారం పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నది కంటే, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ బరిలో దిగుతాడా? అన్నదానిపైనే అభిమానుల దృష్టి సారించి ఉంది. 38 ఏళ్ల నాదల్ తన చివరి టోర్నీలో ఆడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జోస్ మారియా మార్టిన్ కోర్ట్ (సామర్థ్యం 9200) టికెట్లు అన్ని అమ్ముడుపోవడం విశేషం. రఫెల్ బరిలో దిగుతారా? అని అడిగినప్పుడు, నాదల్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, ఈ ప్రశ్నకు కెప్టెన్ సమాధానం చెబుతారు అని స్పందించాడు. స్పెయిన్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ డేవిడ్ ఫెరర్ కూడా నాదల్ ఆడే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.

Details

 రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదు : నాదల్

రేపు ఎవరు ఆడతారనేది ఇంకా నిర్ణయించలేదని ఫెరర్ వ్యాఖ్యానించాడు. నెదర్లాండ్స్‌తో జరిగే పోరులో, నాదల్ సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లో కూడా బరిలో దిగే అవకాశం ఉంది. డబుల్స్ మ్యాచ్ కోసం కార్లోస్ అల్కరాస్‌తో జోడీగా నాదల్ సిద్ధంగా ఉన్నాడు. సింగిల్స్‌లో గెలిచే స్థాయిలో పోటీ చేయలేనని అనిపిస్తే, ఆడటం తప్పుకుంటానని నాదల్ వెల్లడించాడు. తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను తోసిపుచ్చిన నాదల్, ఇప్పటి దాకా రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదని, తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికే ఇక్కడ ఉన్నానని పేర్కొన్నారు.