Riyan-parag: 'ఈ-సిగరెట్' వివాదంలో రియాన్ పరాగ్.. ఐపీఎల్ నిబంధనలు ఏమంటున్నాయి?
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) వాడుతూ కనిపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజస్థాన్ జట్టు లక్ష్య ఛేదనలో ఉన్న సమయంలో 16వ ఓవర్‌లో ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ సమీపంలో ఉండగానే పరాగ్ ఈ-సిగరెట్ పీలుస్తున్నట్లు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాలు
నిబంధనలు ఏమంటున్నాయి?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం స్టేడియం ప్రాంగణంలోనే కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లలో కూడా ధూమపానం చేయడానికి అనుమతి లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే పొగ తాగాల్సి ఉంటుంది. అదేవిధంగా, భారత్‌లో 2019 సంవత్సరం నుంచి ఈ-సిగరెట్ల అమ్మకం, నిల్వ, వినియోగంపై నిషేధం అమల్లో ఉంది. రియాన్ పరాగ్ నిజంగా ఈ-సిగరెట్ ఉపయోగించినట్లు నిర్ధారణ అయితే, ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) 2019 ప్రకారం అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించే అవకాశం ఉండగా, కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడొచ్చు. ఈ ఘటనపై బీసీసీఐ విచారణ చేపట్టి, పరాగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.