
IPL 2025: గణాంకాలకన్నా గెలుపే ముఖ్యం.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. ఆదివారం ధర్మశాలలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు మరింత దగ్గరైంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
12 ఏళ్ల విరామం తర్వాత ధర్మశాలలో విజయాన్ని నమోదు చేయడం పంజాబ్‌కు గర్వకారణంగా మారింది.
ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, జట్టు ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. "అందరూ సరైన సమయంలో సత్తా చాటారు.
Details
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అద్భుతంగా ఆడాడు
జట్టు విజయానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అద్భుతంగా ఆడాడు. అతని బ్యాటింగ్ కనులవిందుగా మారింది. ధర్మశాలలో రికార్డుల గురించి నాకు తెలియకపోవడం మంచిదే.
మేం గణాంకాలపై కాకుండా, మ్యాచ్ గెలవడంపైనే దృష్టి పెట్టాం. అదృష్టం మనవైపు ఉంది.. కానీ అది కష్టంతోనే వచ్చిందని ఆయన వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.