
Womens ODI World Cup: మహిళల వన్డే వరల్డ్‌కప్.. సెమీస్ బెర్త్ కోసం భారత్ పోరాటం
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల వన్డే ప్రపంచకప్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు జట్లు సెమీస్‌కు అర్హత సాధించగా, చివరి నాలుగో బెర్త్ కోసం హోరాహోరీ పోరు నెలకొంది. వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయమొచ్చిన భారత్ మహిళా జట్టు తన సెమీస్ అవకాశాలను క్లిష్టమైన పరిస్థితిలోకి తీసుకువచ్చింది. చివరి బెర్త్ కోసం టీమిండియా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. భారత జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచింది. 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ (అక్టోబర్ 23), బంగ్లాదేశ్ (అక్టోబర్ 26)తో మిగిలిన మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నాయి. సెమీస్‌కు నేరుగా చేరాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలవడం తప్పనిసరి.
Details
మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలవాలి
ఒక మ్యాచ్‌లో గెలిచినా, మరొకదాంట్లో ఓడితే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి భారత్‌కు అవకాశముంటుంది. రన్‌రేట్ మెరుగ్గా ఉంటే సెమీస్ రేసులో భారత్ ముందు ఉంటుంది. అయితే రెండు మ్యాచ్‌ల్లో ఓడితే, సెమీస్ బెర్త్ దాదాపుగా దూరమవుతుంది. భారత జట్టు రన్‌రేట్ పాజిటివ్‌గా ఉండటం ఒక సానుకూల అంశం. న్యూజిలాండ్ ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో గెలిచి 4 పాయింట్లను సంపాదించగా, మిగిలిన రెండు మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంది. న్యూజిలాండ్ ఆ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే, సెమీస్ రేసులో భారత్ వెనుకబడుతుంది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించడంతో, ఆ జట్టు కూడా 4 పాయింట్లకు చేరింది. చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిస్తే, శ్రీలంక కూడా సెమీస్ రేసులోకి చేరుతుంది.