Page Loader
మార్చి 4న మహిళల ఐపీఎల్ ప్రీమియర్ లీగ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 4 నుంచి 26 వరకు జరగనుంది.

మార్చి 4న మహిళల ఐపీఎల్ ప్రీమియర్ లీగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2023
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. మార్చి 4 నుంచి 26వ తేదీ వరకూ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడీయం, డివై పాటిల్ స్టేడియాలు ఈ లీగ్ కు అతిథ్యమివ్వనున్నాయి. చివరి మ్యాచ్ మార్చి 26న చివరి మ్యాచ్ జరగనుంది. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 13న ముంబైలో జరగనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్లో మొత్తం 5 జట్లు ఆడనున్నాయి. మార్చి 4న ముంబై, అహ్మదాబాద్‌తో తలపడుతుంది. అదానీ గ్రూప్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ వద్ద రూ. 1,289 కోట్లు ఉండగా.. ముంబైకి చెందిన జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం వద్ద రూ. 912.99 కోట్లు ఉన్నాయి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

దక్షిణాఫ్రికాలో మహిళల T20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 26న ముగియనుంది. అనంతరం ఎనిమిది రోజుల తర్వాత ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుంది. మొదటి సీజన్‌ మొత్తం ముంబైలో ఆడనున్నట్లు బీసీసీఐ ధ్రువీకరించింది. మహిళల ఐపీఎల్ హక్కులను జనవరిలో రూ.951 కోట్లకు Viacom18 గెలుచుకుంది. ఒక్కొక్క మ్యాచ్ విలువ రూ. 7.09 కోట్లు ఉండనుంది. దీంతో WPL ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మహిళల క్రికెట్ పోటీగా నిలిచింది. మహిళల ప్రీమియర్ లీగ్ జట్లు కనీసం 15 మంది ఆటగాళ్లను కలిగి ఉండాలి. గరిష్టంగా 18 మంది ఆటగాళ్లు ఉండవచ్చని తెలుస్తోంది.