
WPL 2025 Auction: మహిళా ప్రీమియర్ లీగ్.. వేలంలో ఆకట్టుకునే ప్లేయర్లు ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
2024 ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ వేలం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరులో జరిగే ఈ వేలంలో 120 మంది దేశీయ, విదేశీ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఐదు జట్లు తమ టీమ్‌ల కోసం ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి.
అందులో ఒక్కో జట్టులో 18 మంది ఉండే అవకాశం ఉంది. అయితే కేవలం 19 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.
వాటిలో ఐదు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. భారత క్రికెటర్లలో స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, శుభా సతీస్ వంటి ప్రముఖ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.
Details
ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందంటే?
విదేశీ క్రికెటర్లలో ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డాటిన్, దక్షిణాఫ్రికా ప్లేయర్ లిజెల్ లీ, ఇంగ్లాండ్ క్రికెటర్ లారెన్ బెల్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా వేలంలో ఉంటారు.
మరో వైపు, 13 ఏళ్ల అన్షు నగార్, ఇటీవల మహిళల దిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
గుజరాత్ జెయింట్స్ : రూ. 4.4 కోట్లు (4 స్లాట్‌లు)
ఆర్సీబీ : రూ. 3.25 కోట్లు (4 స్లాట్‌లు)
యూపీ వారియర్స్ : రూ. 3.90 కోట్లు (3 స్లాట్‌లు)
దిల్లీ క్యాపిటల్స్ : రూ. 2.5 కోట్లు (4 స్లాట్‌లు ఖాళీ)
ముంబయి ఇండియన్స్ : రూ. 2.65 కోట్లు (4 స్లాట్‌లు)
Details
జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్
ఈ వేలం బెంగళూరులో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.
జియో సినిమాలు ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయబడుతుంది. అదేవిధంగా, స్పోర్ట్స్ 18 ఛానళ్లలో వీక్షించవచ్చు.
ఎవరెవరూ ఎంత ధర పలుకుతారో వేలం వరకూ వేచి చూడాల్సిందే.