అత్యంత వేగంగా పర్వాతాలను ఎక్కి.. వరల్డ్ రికార్డును సృష్టించిన మహిళలు
ఈ వార్తాకథనం ఏంటి
ఓ నార్వే మహిళ, నేపాలీ సేర్పా వరల్డ్ రికార్డును క్రియేట్ చేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా 8వేల మీటర్లుపైగా ఉన్న 14 పర్వతాలను ఎక్కి చరిత్రను సృష్టించారు.
నార్వే మహిళ పేరు క్రిస్టిన్ హారీలా, నేపాలీ షేర్పా అనే ఇద్దరు ఈ రికార్డును సాధించడం విశేషం.
తాజాగా ప్రపంచంలోని రెండో అత్యంత ఎత్తయిన పర్వతం(8611 మీటర్లు)పాకిస్థాన్ లో ఉన్న కే2ని ఎక్కి ఈ రికార్డును క్రియేట్ చేశారు.
మూడు నెలల్లోనే ప్రపంచంలోని మొత్తం 14 పర్వతాలను ఈ ఇద్దరూ ఎక్కేశారు
Details
92 రోజుల్లో 14 పర్వతాలను ఎక్కి రికార్డు సృష్టించాడు
సాధారణంగా ఈ ఘనత సాధించాలంటే కొందరికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది.
ఇంతకుముందు 2019లో నేపాల్ కు చెందిన నిర్మల్ పూర్జా ఆరు నెలల్లో ఈ 14 పర్వతాలను ఎక్కిన రికార్డు ఉంది. తాజాగా ఈ రికార్డును క్రిస్టిన్, టెన్ జెన్ బద్దలు కొట్టారు.
ఏప్రిల్ 26న తొలిసారిగా ఈ ఇద్దరూ చైనాలోని షిషాపంగ్నాను ఎక్కడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఎవరెస్ట్, కాంచన్‌జంగా, లోట్సె, మకాలు, చో ఒయు, దౌలగిరి, మనస్లు, అన్నపూర్ణ, నంగా పర్బత్, గాషెర్‌బ్రమ్ 1, గాషెర్‌బ్రమ్ 2, బ్రాడ్ పీక్, మౌంట్ కే2లను అధిరోహించారు.
92 రోజుల్లోనే ఈ పర్వతాలన్నింటీని ఆ ఇద్దరు ఎక్కేయడం విశేషం.